JOBS: తెలంగాణ నిరుద్యోగులకు బిగ్ షాక్.. మరో ఎగ్జామ్ వాయిదా!

తెలంగాణ నిరుద్యోగులకు మరో బ్యాడ్ న్యూస్. కెమిస్ట్ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షను వాయిదా వేస్తున్నట్లు TS GENCO అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల కారణంగా వాయిదా వేశామని, త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపింది.

TS ECET : ఈసెట్‌ ఫలితాల తేదీ ఖరారు..
New Update

TS GENCO Exam Postponed: తెలంగాణ నిరుద్యోగులకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలు ఎగ్జామ్స్ వాయిదా పడటంతో ఉద్యోగ అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతుండగా తాజాగా మరో పరీక్ష పోస్ట్ పోన్ అయింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (TS GENCO) కీలక ప్రకటన చేసింది.

TS GENCO Exam Postponed

ఎన్నికల కోడ్ కారణంగా..
ఈ మేరకు కెమిస్ట్ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షను వాయిదా వేస్తున్నట్లు అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. మార్చి 31న జరగాల్సిన ఏఈ ఎగ్జామ్ ఎన్నికల కోడ్ కారణంగా పరీక్ష వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. అలాగే కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని, అభ్యర్థులు దీనిని గమనించాలని కోరారు.

ఇది కూడా చదవండి: TS: టీచర్లకు తెలంగాణ సర్కార్ షాక్.. ఆ డిమాండ్ కు నో!

ఇక తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (TS GENCO)లో 339 అసిస్టెంట్ ఇంజినీర్ (AE), 60 కెమిస్ట్‌ (Chemist) పోస్టులను ప్రత్యక్ష, రెగ్యులర్ నియామకాల పద్ధతిలో భర్తీ చేసేందుకు గతేడాది నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 399 పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.

#ts-genco
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి