TS Elections: తెలంగాణలో మళ్లీ ఎన్నికల సందడి.. సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడంటే?

తెలంగాణలో మరో ఎన్నికల సందడి మొదలవబోతోంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. డిసెంబర్ చివరి వారంలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
TS Elections: తెలంగాణలో మళ్లీ ఎన్నికల సందడి.. సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడంటే?

TS Panchayat Elections: అసెంబ్లీ ఎన్నికల హడావుడి ముగిసి కొన్ని రోజులైనా గడవకముందే తెలంగాణలో మరో ఎన్నికల సందడి మొదలవబోతోంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అతిత్వరలో నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది. ఎన్నికల ప్రక్రియకు ఏర్పాట్లు ప్రారంభించాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం (State Election Commission) అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీచేసింది.

ఇది కూడా చదవండి: 24 గంటల్లోపే యాక్షన్‌ ప్లాన్‌.. టార్గెట్‌ కేసీఆర్‌.. శ్వేతపత్రం రిలీజ్‌ నిర్ణయం వెనుక కారణం ఇదే!

వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరి మధ్యలో తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశముంది. 2024 జనవరి 31తో ప్రస్తుత సర్పంచ్‌ల పదవీకాలం ముగుస్తుంది. క్రితం సారి 2019లో జనవరి ఒకటో తేదీనే సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. సర్పంచ్ ఎన్నికలు 2019 జనవరిలో 3 దశల్లో జరిగాయి. పదవీ కాలం ముగియడానికి మూడు నెలల ముందే పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ, అసెంబ్లీ ఎన్నికల వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమైంది. అయితే, డిసెంబర్ చివరి వారంలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాలకు సంబంధించి రిజర్వేషన్లపై కార్యదర్శుల ద్వారా వివరాలు సేకరించారు. మరో వారం పదిరోజుల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశముంది. అయితే, కొత్త ప్రభుత్వం రిజర్వేషన్లు మార్చాలని భావిస్తే తప్ప, గతంలోని పంచాయతీ రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లే అవకాశముందని పరిశీలకులు చెప్తున్నారు.

Advertisment
తాజా కథనాలు