TS Politics: తెలంగాణలో జనసేన పోటీ చేసే 8 సీట్లు ఇవే? తెలంగాణలో బీజేపీ-జనసేన పొత్తు ఖాయమైన నేపథ్యంలో సీట్ల విషయమై ఇరు పార్టీల నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేనకు 8 సీట్లను కేటాయించడానికి బీజేపీ అంగీకరించినట్లు సమాచారం. By Nikhil 02 Nov 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణలో బీజేపీ-జనసేన (TDP-Janasena Alliance) పొత్తు ఖాయమైంది. జనసేనకు మొత్తం 8 సీట్లు కేటాయించడానికి బీజేపీ (BJP) సిద్ధం అయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. జనసేన మాత్రం పదికి పైగా సీట్లను తమకు ఇవ్వాలని బీజేపీని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తన అన్న కుమారుడు వరుణ్ తేజ వివాహం కోసం ఇటలీకి వెళ్లారు. ఈ రోజు లేదా రేపు పవన్ కల్యాణ్ హైదరాబాద్ కు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయన వచ్చిన తర్వాత సీట్లపై ఫైనల్ లెక్క తేలుతుందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం ఆధారంగా తెలంగాణలో జనసేన పోటీ చేసే స్థానాల వివరాలు ఇలా ఉన్నాయి. ఇది కూడా చదవండి: Vijayashanthi: రాజకీయాల్లో డబుల్ యాక్షన్ కుదరదు..ఏదో ఒక్క దానికే…! 1.మెదక్ 2.తాండూర్ 3.కూకట్ పల్లి 4.నాగర్ కర్నూల్ 5.పినపాక 6.అశ్వారావు పేట 7.వైరా 8.కోదాడ ఇప్పటికే 53 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. మరో 66 స్థానాల్లో అభ్యర్థులను పెండింగ్ లో ఉంచింది. ఇందులో 8 స్థానాలను జనసేనకు కేటాయించాలని నిర్ణయించడంతో.. మరో 58 స్థానాలకు బీజేపీ అభ్యర్థులు ఫైనల్ కావాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన లిస్ట్ ఈ రోజు సాయంత్రంలోగా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. #bjp #janasena #telangana-elections-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి