TS Elections: పటేల్ రమేష్ రెడ్డితో పాటు నామినేషన్లను విత్ డ్రా చేసుకున్న కాంగ్రెస్ రెబల్స్ వీరే! పార్టీ పెద్దల సూచనలతో సూర్యాపేటలో పటేల్ రమేష్ రెడ్డితో పాటు బాన్సువాడ - కాసుల బాలరాజ్, జుక్కల్ - గంగారాం, వరంగల్ వెస్ట్ - జంగా రాఘవరెడ్డి, డోర్నకల్ - నెహ్రూ నాయక్, ఇబ్రహీంపట్నం - దండెం రామిరెడ్డి తదితర కాంగ్రెస్ రెబల్స్ ఈ రోజు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. By Nikhil 15 Nov 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణ ఎన్నికల్లో (Telangana Elections) మరో కీలక ఘట్టమైన నామినేసన్ల ఉపసంహరణ గడువు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. రెబల్స్ గా బరిలోకి దిగిన అనేక మంది నామినేషన్లను ఉపసంహరించుకునేలా కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఇందుకోసం రోహిత్ చౌదరి, మల్లురవి లాంటి కీలక నేతలు రంగంలోకి దిగి చర్చలు జరిపారు. ముఖ్యంగా సూర్యాపేటలో రమేష్ రెడ్డి (Patel Ramesh Reddy) నామినేషన్ ఉపసంహరణ సమయంలో హైడ్రామా చోటు చేసుకుంది. చర్చలు జరపడానికి వచ్చిన మల్లు రవిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడం సంచలనంగా మారింది. రమేష్ రెడ్డి నామినేషన్ ఉప సంహరణకు అంగీకరించినా.. కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎట్టకేలకు నామినేషన్ ఉపసంహరించుకున్న రమేష్ రెడ్డి మీడియాతో మాట్లాడి.. తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లేకుండా పోయిందని కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పిస్తామని హైకమాండ్ తో పాటు స్థానిక నేతలు హామీ ఇచ్చారని తెలిపారు. పార్టీ పెద్దల మాటను గౌరవించి నామినేషన్ ను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. ఇది కూడా చదవండి: CM KCR: మైనంపల్లి రోహిత్ ఓ దిష్టి బొమ్మ.. మెదక్ మీటింగ్ లో కేసీఆర్ సెటైర్లు! ఈ రోజు నామినేషన్ విత్ డ్రా చేసుకున్న కాంగ్రెస్ రెబల్స్ వీరే.. బాన్సువాడ - కాసుల బాలరాజ్, జుక్కల్ - గంగారాం, వరంగల్ వెస్ట్ - జంగా రాఘవరెడ్డి, డోర్నకల్ - నెహ్రూ నాయక్, ఇబ్రహీంపట్నం - దండెం రామిరెడ్డి, పినపాక - విజయ్ గాంధీ, వైరా - రామ్మూర్తి నాయక్. #congress #telangana-elections-2023 #telangan-politics మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి