/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/CM-Revanth-Reddy-jpg.webp)
కాంగ్రెస్ (Telangana Congress) స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్న సమయంలో ఆ పార్టీ సీనియర్ నేత వీహెచ్ సంచలన ప్రకటన చేశారు. రేవంత్ రెడ్డి కాబోయే సీఎం అని స్పష్టం చేశారు. పార్టీ కోసం ఆయన చాలా కష్టపడ్డారన్నారు. కామారెడ్డిలో కూడా పోటీ చేసి గెలవబోతున్నాడని అన్నారు. కాంగ్రెస్ కు 70 సీట్లు వస్తాయని తాను ముందు నుంచి చెబుతున్నానని అన్నారు. ఇది ప్రజల విజయంగా అభివర్ణించారు వీహెచ్. మరో వైపు రేవంత్ రెడ్డి నివాసం వద్ద సందడి స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే డీజీపీ అంజనీ కుమార్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ తదితరులు అయన నివాసానికి చేరుకుని శుభాకాంక్షలు తెలిపారు.
ఇది కూడా చదవండి: TS Elections 2023: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. ఓటమి దిశగా ఆ ఏడుగురు మంత్రులు!