Etela Rajender: ఈటల రాజేందర్‌ సంచలన హామి.. వారిలో ప్రతి ఒక్కరికీ 5 లక్షల రూపాయలు!

పూసల వాళ్ళ వృత్తి ఒకప్పుడు గొప్పగా ఉండేదని.. కానీ ఈనాడు ఆ పరిస్థితి లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. గతి లేక ఈ పని చేస్తున్నారన్నారు. భీమా కింద రైతుకు, కల్లు గీత కార్మికులకు, మత్యకారులకు, గొర్ల కాపరులకు ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారని.. కానీ రైతుకూలీలకు మిగిలిన పేదవారికి ఇవ్వడంలేదన్నారు ఈటల. మేము అధికారంలోకి వస్తే తెల్లరేషన్ కార్డు ఉన్న 59 సంవత్సరాల లోపు ఎవరు చనిపోయిన ప్రతి ఒక్కరికీ 5 లక్షల రూపాయలు స్కీమ్ మ్యానిఫెస్టోలో పెడతామన్నారు ఈటల.

New Update
Etela Rajender: ఈటల రాజేందర్‌ సంచలన హామి.. వారిలో ప్రతి ఒక్కరికీ 5 లక్షల రూపాయలు!

ఇంకా కులం పేరు చెప్పడానికే సిగ్గుపడే కులాలు ఎన్నో ఉన్నాయన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌(Etala Rajendar). అసలే గుర్తింపు లేని కులాలు కూడా ఉన్నాయని... అందుకే తాను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 40 రోజుల పాటు అసెంబ్లీలో కులాల వారీగా కూర్చోబెట్టి వారి సమస్యలు రాసుకున్నానని చెప్పారు ఈటల. ఇందిరాపార్క్ వద్ద పూసల సంఘం ధర్నా కార్యక్రమంలో ఈటల రాజేందర్‌ పాల్గొన్నారు. ఎంబీసిలో, DNTలలో చేర్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ చేస్తున్న నిరాహారదీక్షను నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు ఈటల రాజేందర్.

ఈటల ఏం అన్నారంటే?

• పూసల వాళ్ళు 10 రూపాయల వడ్డీ తెచ్చుకొని గాజులు కొనొక్కుని అమ్ముకుంటున్నారు.

• నేను మంత్రిగా ఉన్నప్పుడు ఏ గ్యారంటీ లేకుండా 50 వేల రూపాయల చెక్కులు ఇచ్చాము . కానీ వాటిని కూడా నిలిపివేశారు.

• 52 జాతులు సంచార జాతులు ఉంటే 14 కులాలు మాత్రమే గుర్తించారు. వారికి కూడా నిధులు ఇవ్వడం లేదు.

• 100 ఎకరాల భూస్వామి ప్రతి ఏడాది రైతు బంధు కింద పది లక్షల రూపాయలు కేసీఆర్‌ ఇస్తున్నారు. బెంజ్ కారులో వచ్చి చెక్కులు తీసుకుంటున్నారు.

• కానీ పూసలు అమ్ముకొనే వారికి మీరు ఇచ్చేది ఎంత ?

• నాలాంటి బిడ్డకు అధికారం ఇస్తే 50 వేల లెక్క లిమిట్ లేకుండా ఇస్తాం.

• భీమా కింద రైతుకు, కల్లు గీత కార్మికులకు, మత్యకారులకు, గొర్ల కాపరులకు ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు. కానీ రైతుకూలీలకు మిగిలిన పేదవారికి ఇవ్వడంలేదు. మేము అధికారంలోకి వస్తే తెల్లరేషన్ కార్డు ఉన్న 59 సంవత్సరాల లోపు ఎవరు చనిపోయిన ప్రతి ఒక్కరికీ 5 లక్షల రూపాయలు స్కీమ్ మ్యానిఫెస్టోలో పెడతాం.

• మేము అధికారంలోకి వస్తే కేటాయించిన ప్రతి రూపాయి ఖర్చు పెడతాం.

వారికి అండగా ఉంటాం:

డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదని.. ఇంత పెద్ద ప్రాజెక్ట్స్ కట్టిన కేసీఆర్‌కు పేదలకు ఇల్లు కట్టడానికి మాత్రం మనసు రావడంలేదన్నారు. మళ్లీ కెసిఆర్ మాటలు విని బోర్లా పడవద్దని సూచించారు ఈటల. వీళ్లకు పైసలు ఇస్తే చాలు ఓట్లు వేస్తారు అని వారు భావిస్తున్నారన్నారు. కులంలో చిన్నవాళ్ళం అయి ఉండవచ్చు కానీ జ్ఞానంలో పెద్దవాళ్ళమన్నారు ఈటల. మన బతుకులు మారాలి అంటే ఆలోచించి ఓటు వేయండని తెలిపారు. మన సత్తా ఏంటో చాటాలని.. ధర్నా చేసిన పట్టించుకొనే సోయి ఈ ప్రభుత్వానికి లేదన్నారు ఈటల. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అయిన పట్టించుకోండని కెసిఆర్ వ్యాఖ్యానించారు. నేను ఎల్లవేళలా పూసల వారికి అండగా ఉంటానని ఈటల రాజేందర్ చెప్పారు. ఇక కులసంఘల భవనాలు వెంటనే నిర్మాణం చెయ్యాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు.

ALSO READ: ఏపీలో ముందస్తు ఎన్నికలు..? తెలంగాణలో ఆలస్యంగా ఎన్నికలు..!

Advertisment
Advertisment
తాజా కథనాలు