TS EdCET: టీఎస్ ఎడ్ సెట్ 2024 షెడ్యూల్ విడుదల..రాతపరీక్షతేదీ ఇదే..!!

రాష్ట్రంలోని బీఎడ్ కళాశాలల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే టీఎస్ ఎడ్ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. మార్చి 4న టీఎస్ ఎడ్ సెట్ 2024 నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మే 23న కంప్యూటర్ బేస్డ్ విధానంలో రాతపరీక్ష నిర్వహించనున్నట్లు ఎడ్‌సెట్ క‌న్వీన‌ర్ వెల్ల‌డించారు.

TS EdCET: టీఎస్ ఎడ్ సెట్ 2024 షెడ్యూల్ విడుదల..రాతపరీక్షతేదీ ఇదే..!!
New Update

TS EdCET: తెలంగాణలో రాష్ట్రంలోని బీఎడ్ కాలేజీల్లో ప్రవేశాల నిమ్మిత్తం నిర్వహించే టీఎస్ ఎడ్ సెట్ (TS EdCET)ప్రవేశ పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. మార్చి 4వ తేదీన టీఎస్ ఎడ్ సెట్ 2024 నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఎడ్‌సెట్ క‌న్వీన‌ర్ ప్రొఫెస‌ర్ టీ మృణాళిని వెల్ల‌డించారు.

మార్చి 6వ తేదీ నుంచి దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా స్వీకరించనున్నారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా మే 6వ తేదీ వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆలస్య రుసుముతో మే 13వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. మే 23న కంప్యూటర్ బేస్డ్ విధానంలో రాతపరీక్షను నిర్వహించనున్నారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు , మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండు విడతల్లో రాతపరీక్ష నిర్వహించనున్నారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ చేతులెత్తేసింది.. బడ్జెట్‌పై హరీష్ రావు ఫైర్

కాగా దేశవ్యాప్తంగా వైద్య, విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్, యూజీ పరీక్షకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ పరీక్షకు మే 5వ తేదీన నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం అధికారికంగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 9 నుంచి మార్చి 9న తేదీ రాత్రి 9గంటల వరకు ఆన్ లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఇంగ్లీష్ , హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో పెన్ను, పేపర్ విధానంలో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. 

జనరల్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 1700కాగా, జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్ అభ్యర్థులకు రూ. 1600 ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు , థర్డ్ జండర్ అభ్యర్థులు రూ. 1000చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డుల డౌన్ లోడ్, పరీక్షా కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. నీట్ పరీక్ష మే 5న మధ్యాహ్నం, 2గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు జరగనుంది. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఎన్టీఏ ఈ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తదితర వివరాల కోసం https://nta.ac.in/medicalexam అనే వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.

ఇది కూడా చదవండి: బీ కేర్ ఫుల్.. జనసైనికులకు పార్టీ అధినేత పవన్ హెచ్చరిక..!

#telangana #osmania-university #bed-course #ts-edcet-2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe