ఇటీవల జరిగిన తెంగాణ ఎన్నికల్లో విజయం సాధించి ఊపు మీద ఉన్న తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) సంచలన నిర్ణయం తీసుకుంది. తమ అధినేత్రి సోనియా గాంధీని (Sonia Gandhi) తెలంగాణ నుంచి పోటీ చేయించాలని తీర్మానం చేసింది. ఈ రోజు జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ తీర్మానం చేశారు. మెదక్ ఎంపీగా సోనియాగాంధీని పోటీ చేయించనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇందిరా గాంధీ సైతం మెదక్ నుంచే పోటీ చేసి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా సోనియా గాంధీని ఇక్కడి నుంచి పోటీ చేయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ కు ఫస్ట్ షాక్.. రేపటి నుంచి వారి సమ్మె!
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించినా.. సీట్లు మాత్రం మేజిక్ ఫిగర్ కన్నా కేవలం 5 మాత్రమే ఎక్కువ సాధించింది. దీంతో రానున్న ఎంపీ ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించి తమ బలం చాటాలని భావిస్తోంది హస్తం పార్టీ. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను కట్టడి చేసే వ్యూహంలో భాగంగా సోనియాను పోటీలోకి దించాలని ఆ పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు.
సోనియా పోటీ చేస్తే కేసీఆర్, హరీశ్ సొంత జిల్లా మెదక్ లోనే బీఆర్ఎస్ ను ఆత్మరక్షణలో పడేయొచ్చన్నది హస్తం నేతల స్కెచ్ గా తెలుస్తోంది. ఈ ప్రభావం రాష్ట్రం మొత్తం ఉండి.. మెజార్టీ సీట్లు దక్కుతాయని లెక్కలు వేసుకుంటున్నారు ఆ పార్టీ నేతలు.