TS Congress: ఆ సీటు నుంచి ఎంపీగా సోనియా పోటీ.. తెలంగాణ కాంగ్రెస్ సంచలన తీర్మానం!

రానున్న తెలంగాణ ఎన్నికల్లో సోనియాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఈ రోజు గాంధీభవన్ లో నిర్వహించిన పీఏసీ మీటింగ్ లో నేతలు తీర్మానించారు. సోనియా గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేస్తే మెజార్టీ సీట్లు దక్కుతాయన్న వ్యూహంతో ఈ తీర్మానం చేసినట్లు సమాచారం.

New Update
TS Congress: ఆ సీటు నుంచి ఎంపీగా సోనియా పోటీ.. తెలంగాణ కాంగ్రెస్ సంచలన తీర్మానం!

ఇటీవల జరిగిన తెంగాణ ఎన్నికల్లో విజయం సాధించి ఊపు మీద ఉన్న తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) సంచలన నిర్ణయం తీసుకుంది. తమ అధినేత్రి సోనియా గాంధీని (Sonia Gandhi) తెలంగాణ నుంచి పోటీ చేయించాలని తీర్మానం చేసింది. ఈ రోజు జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ తీర్మానం చేశారు. మెదక్ ఎంపీగా సోనియాగాంధీని పోటీ చేయించనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇందిరా గాంధీ సైతం మెదక్ నుంచే పోటీ చేసి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా సోనియా గాంధీని ఇక్కడి నుంచి పోటీ చేయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ కు ఫస్ట్ షాక్.. రేపటి నుంచి వారి సమ్మె!

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించినా.. సీట్లు మాత్రం మేజిక్ ఫిగర్ కన్నా కేవలం 5 మాత్రమే ఎక్కువ సాధించింది. దీంతో రానున్న ఎంపీ ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించి తమ బలం చాటాలని భావిస్తోంది హస్తం పార్టీ. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను కట్టడి చేసే వ్యూహంలో భాగంగా సోనియాను పోటీలోకి దించాలని ఆ పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు.

సోనియా పోటీ చేస్తే కేసీఆర్, హరీశ్ సొంత జిల్లా మెదక్ లోనే బీఆర్ఎస్ ను ఆత్మరక్షణలో పడేయొచ్చన్నది హస్తం నేతల స్కెచ్ గా తెలుస్తోంది. ఈ ప్రభావం రాష్ట్రం మొత్తం ఉండి.. మెజార్టీ సీట్లు దక్కుతాయని లెక్కలు వేసుకుంటున్నారు ఆ పార్టీ నేతలు.

Advertisment
తాజా కథనాలు