TS Congress: కాంగ్రెస్‌లో మరో వికెట్‌.. నాగం గుడ్‌బై?

నాగర్ కర్నూల్ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యాచారణపై నిర్ణయం తీసుకుంటానని ఆయన ప్రకటించారు.

TS Congress: కాంగ్రెస్‌లో మరో వికెట్‌.. నాగం గుడ్‌బై?
New Update

మొత్తం 55 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ (Congress party) నిన్న ఫస్ట్ లిస్ట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. టికెట్ దక్కని కారణంతో పలు చోట్ల నాయకులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. పార్టీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. టికెట్ దక్కదన్న భావనతో ఇప్పటికే పొన్నాల లక్ష్మయ్య (Ponnala Laxmaiah) పార్టీని వీడి ఈ రోజు కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. మరో నేత జిట్టా బాలకృష్ణారెడ్డి కూడా బీఆర్ఎస్ గూటికి చేరడానికి సిద్ధం అవుతున్నారు. తాజాగా మరో సీనియర్ నేత పార్టీకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. నాగర్ కర్నూల్ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి (Nagam Janardhan Reddy) పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Neelam Madhu: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. నీలం మధు రాజీనామా

తనకు కాదని 2018లో కాంగ్రెస్‌ను ఓడగొట్టిన దామోదర్‌రెడ్డి కుమారుడికి టికెట్ ఎలా ఇస్తారంటూ ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బీఆర్‌ఎస్‌లో అర్హత లేని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుకు టికెట్లు ఎలా ఇచ్చారంటూ ఆయన ఈ రోజు జరిగిన కార్యకర్తల సమావేవంలో ప్రశ్నించారు. వారంతా కాంగ్రెస్‌లో హీరోలు ఎలా అయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: TS Politics: కాంగ్రెస్ కు జిట్టా బాలకృష్ణారెడ్డి షాక్.. నేడు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లోకి?

పోరాటాలు చేసినందుకు మాపై కేసులు నమోదైతే.. నిన్న, మొన్న వచ్చినోడికి టికెటా? అంటూ తీవ్రంగా ప్రశ్నించారు. కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని నాగం తెలిపారు. బీజేపీ నుంచి లేదా ఇండిపెండెంట్ గా ఆయన పోటీ చేసే అవకాశం ఉంది.

#telangana-elections-2023 #telangana-congress-party #nagam-janardhan-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe