తెలంగాణ ఎన్నికల్లో (Telangana Elections 2023) పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి బీజేపీ (TS BJP) నుంచి ఇప్పటికే రెండు లిస్టులు విడుదలయ్యాయి. మొదటి లిస్ట్ లో 52 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా.. కేవలం ఒక అభ్యర్థితో నిన్న సెకండ్ లిస్ట్ విడుదల చేసింది ఆ పార్టీ హైకమాండ్. ఈ నేపథ్యంలో రహస్య ప్రదేశంలో బీజేపీ రాష్ట్ర ఇంఛార్జిలతో తాజాగా ముఖ్య నేతలు సమావేశమైనట్లు తెలుస్తోంది. మూడో జాబితా కోసం కసరత్తు చేయడం కోసమే ఈ భేటీ అని నేతలు చెబుతున్నారు. సమావేశంలో తరుణ్ చుగ్, ప్రకాశ్ జవదేకర్, సునీల్ బన్సల్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఈటల, డీకే అరుణ, సంజయ్ తదితరులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. జనసేన పొత్తులు, సీట్ల సర్దుబాట్లపై ఈ భేటీలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇటీవల కొందరు నేతలు పార్టీని వీడిన నేపథ్యంలో పార్టీకి నష్టం జరగకుండా చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
TS BJP: తెలంగాణ బీజేపీ ముఖ్య నేతల సీక్రెట్ మీటింగ్.. అందుకోసమేనా?
తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు ఈ రోజు సీక్రెట్ గా మీటింగ్ అయ్యారన్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి. అయితే.. అభ్యర్థుల ఖరారు కోసమే ఈ నేతలు సమావేశమైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశానికి తరుణ్ చుగ్, ప్రకాశ్ జవదేకర్, సునీల్ బన్సల్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఈటల, డీకే అరుణ, సంజయ్ తదితరులు హాజరైనట్లు తెలుస్తోంది.
New Update
Advertisment