Telangana Assembly Elections: మరికొన్ని నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. శాసనసభ గడువు ముగిసేలోపే ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది ఎన్నికల సంఘం. ఈ నేపత్యంలోనే.. ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ అక్టోబర్ మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అక్టోబర్ 6వ తేదీ లోపు ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవ్వొచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతకు మించి ఆలస్యం అయితే.. ఎన్నికల నిర్వహణలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు. వాస్తవానికి 2018లో డిసెంబర్ 7న ఎన్నికల జరిగాయి. ఆ తరువాత జనవరి 16వ తేదీన శాసనసభ తొలి సమావేశం జరిగింది. దీని ప్రకారం.. తదుపరి ఎన్నికలు అంటే 2024లో జనవరి 17 లోపే కొత్త శాసనసభ ఏర్పాటు కావాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. అక్టోబర్ 3, 4, 5 తేదీల్లో భారత ఎన్నికల సంఘానికి చెందిన అధికారుల ప్రత్యేక బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన అంశాలను ఈ బృందం పరిశీలించనుంది. ఈ బృందంలో రాష్ట్రలో ఓటర్ లిస్ట్, పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సిబ్బంది, పోలీస్ భద్రతా వంటి అంశాలను పరిశీలించనుంది. ఈ పరిశీలన పూర్తయిన తరువాత కేంద్ర ఎన్నికల సంఘానికి తమ నివేదికను అందజేస్తుంది. ఆ నివేదిక ఆధాంగా వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేస్తుందని చెబుతున్నారు అధికారులు. అయితే, షెడ్యూల్ జారీ అయిన నెల రోజుల తరువాత ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారు. ఆ నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థుల నామినేషన్లు, విత్‌డ్రాలు, తొలగింపుల పరంపర నడుస్తుంది. నోటిఫికేషన్ వెలువడిన నెల రోజుల్లోనే ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తవుతుంది.
ఇదికూడా చదవండి: లవర్ దగ్గర అనకూడని ఆరు మాటలు.. కచ్చితంగా తెలుసుకోని పాటించండి!
ముగిసిన గడువు..
ఇదిలాఉంటే.. ఓటర్ల జాబితా రెండో సవరణలో భాగంగా అభ్యర్థనలు, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 18వ తేదీ వరకు 13.06లక్షల కొత్త ఓటర్ ఐడీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. పేర్ల తొలగింపునకు 6.26 లక్షల అప్లికేషన్స్ వచ్చాయి. అదే సమయంలో సవరణలకోసం 7.77 లక్షల దరఖాస్తులు అందినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు అందిన దరఖాస్తులను ఈనెల 27వ తేదీ లోపు పరిష్కరించి.. అక్టోబరు 4వ తేదీన ఫైనల్ లిస్ట్‌ను విడుదల చేస్తారు.
ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు..
అయితే, గడువు ముగిసినప్పటికీ అర్హులైన వారు ఎప్పుడైనా దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది. ఈ షయాన్ని తెలుపుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కాగా, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 14.72 లక్షలమంది కొత్త ఓటర్లుగా నమోదయ్యారని, 18-19 ఏళ్ళ వయసున్న ఓటర్లు జనవరి 5 నాటికి 2.79 లక్షలుండగా, మంగళవారం వరకు 6.51 లక్షలకు పెరిగినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఓటర్లు 3.13 కోట్లు ఉన్నారని, ఇందులో పురుషుల సంఖ్య 1.57 కోట్లు కాగా.. మహిళల వాటా 1.56 కోట్లు, ఇతరులు 2,226 మంది ఉన్నారు. వివిధ కారణాల వల్ల 3.39 లక్షల మందిని ఓటరు జాబితా నుంచి తొలగించడం జరిగిందని ఎన్నికల సంఘం అధికారులు సదరు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
Also Rad:
Jobs: టెన్త్ అర్హత.. 63వేల శాలరీతో ఆర్మీలో జాబ్స్.. డీటైల్స్ చెక్ చేసుకోండి..!