నా పైన రెండు సార్లు హత్యాయత్నం జరిగింది..మస్క్!

ఎక్స్ లో ఓ యూసర్ ఎలాన్ మస్క్ ను ట్యాగ్ చేస్తూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరలవుతోంది.ట్రంప్ పై జరిగిన ఘటన మీ పైన కూడా జరగొచ్చని ఆ యూజర్ పోస్ట్ చేశాడు. దీనికి స్పందించిన మస్క్ తనపై ఈ 8 నెలల్లో ఇద్దరు వ్యక్తులు నాపైన హత్యాయత్నం చేశారని రిప్లై ఇచ్చారు.

నా పైన రెండు సార్లు హత్యాయత్నం జరిగింది..మస్క్!
New Update

అమెరికాలోని పెన్సిల్వేనియాలో మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో ఆయన చెవి గాయంతో బయటపడ్డారు. ఈ సందర్భంలో, X సోషల్ నెట్‌వర్క్‌లోని ఒక వినియోగదారు ఎలాన్ మస్క్‌ని ఓ ప్రశ్న అడిగారు, "దయచేసి మీ భద్రతను 3 రెట్లు పెంచుకోండి. ‘ట్రంప్‌కే ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే మిమ్మల్ని కూడా చంపే ప్రయత్నం చేస్తారని ఆ యూసర్ మస్క్ ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశాడు.

దీనికి ఎలోన్ మస్క్ స్పందిసూ.. నేను ప్రమాదకరమైన కాలాన్ని దాటాను. గత 8 నెలల్లో ఇద్దరు వ్యక్తులు వేర్వేరు సమయాల్లో నన్ను చంపేందుకు ప్రయత్నించారు. వారు టెస్లా కార్యాలయం సమీపంలో తుపాకీలతో అరెస్టు దొరికారని ఆయన పోస్ట్‌లో పేర్కొన్నారు.

#elanmusk
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe