Beauty Tips: లవంగాలు ముఖానికి మేలు చేస్తాయా?

లవంగాలలో యాంటీ ఆక్సిడెంట్, సెప్టిక్, ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ముఖాన్ని మెరిసేలా, మృదువుగా చేయడానికి లవంగం ఫేస్ ప్యాక్ ట్రై చేయవచ్చు. లవంగాల పౌడర్‌లో పెరుగు, తేనె కలిపి బాగా పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖంపై అప్లై చేసి ఆపై నీటితో ముఖాన్ని కడగాలి.

New Update
Beauty Tips: లవంగాలు ముఖానికి మేలు చేస్తాయా?

Beauty Tips: ముఖాన్ని మెరిసేలా, అందంగా మార్చుకోవడానికి ప్రతిఒక్కరూ ప్రయత్నిస్తారు. ఇలాంటి సమయంలో లవంగాలను ముఖానికి వాడటం సరైనదా కాదా అనే ప్రశ్న చాలామందిలో మెదులుతుంది. లవంగాలను ఉపయోగించడం ద్వారా ముఖాన్ని ఎలా మెరిసేలా చేసుకోవచ్చు. లవంగాలు వాటి ఘాటైన రుచికి చాలా ప్రసిద్ధి చెందినప్పటికీ. దీన్ని ఎక్కువగా వంటగదిలో వంట కోసం ఉపయోగిస్తారు. అయితే ఇప్పుడు మీరు దీన్ని ఉపయోగించి ముఖాన్ని మెరిసేలా, మృదువుగా మార్చుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు లవంగాలలో ఉన్నాయి. లవంగాలు ముఖానికి ఉపయోగపడతాయా లేదా దాని ప్రభావాల గురించి, చర్మ సంరక్షణ గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

లవంగం నూనె :

  • ముఖం మెరిసిపోవడానికి లవంగం నూనెను మార్కెట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఆపై దానిని క్యారియర్ ఆయిల్, కొబ్బరి నూనె, బాదం నూనెతో మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి ఆపై తేలికపాటి చేతులతో ముఖాన్ని మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం మృదువుగా మారడంతో పాటు మచ్చలు కూడా పోతాయి.

లవంగం నీరు: 

  • లవంగం నీటిని కూడా ఉపయోగించవచ్చు. కొన్ని లవంగాలను నీటిలో వేసి మరిగించాలి. నీరు తగ్గినప్పుడు గ్యాస్‌ను ఆపివేసి, నీటిని చల్లబరచాలి. నీరు చల్లారిన తర్వాత స్ప్రే బాటిల్‌లో నింపి ముఖానికి పట్టించాలి. ఇలా చేస్తే ముఖం మెరిసిపోతుంది.

లవంగం ఫేస్ ప్యాక్:

  • లవంగం ఫేస్ ప్యాక్ చేయడానికి లవంగాలను గ్రైండ్ చేసి పౌడర్ సిద్ధం చేయాలి. అందులో పెరుగు, తేనె కలిపి బాగా పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖంపై 10 నుంచి 15 నిమిషాల పాటు అప్లై చేసి ఆపై నీటితో ముఖాన్ని కడగాలి. ఇలా చేయడం వల్ల మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియా చనిపోయి చర్మం శుభ్రంగా, నీట్‌గా కనిపిస్తుంది.

లవంగాలు ప్రయోజనాలు:

  • లవంగాలలో ఉండే యూజినాల్ సహజమైన క్రిమినాశక ఇది చర్మ వ్యాధులతో పోరాడడంలో సహాయపడుతుంది. అంతేకాదు లవంగాల వల్ల డెడ్ స్కిన్ తొలగిపోయి ముడతలు తగ్గుతాయి. చర్మాన్ని బిగుతుగా మార్చడంలో లవంగాలు ఎంతగానో సహకరిస్తాయి. లవంగం నూనెను ఎల్లప్పుడూ ఇతర నూనెలతో కలిపి అప్లై చేయాలి. ఎందుకంటే దీన్ని నేరుగా అప్లై చేయడం వల్ల చర్మానికి హాని కలుగుతుంది. కొందరికి లవంగం నూనె వల్ల అలర్జీ రావచ్చు కాబట్టి ప్యాచ్ టెస్ట్ చేయించుకోవాలి.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: తల్లిదండ్రులు తమ పిల్లల ముందు ఈ పనులు చేయకూడదు..!


Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు