రెస్టారెంట్ బిల్లు కట్టకుండా వెళ్ళిపోయిన ట్రంప్

బిల్లు నాది.. ఫుడ్ మీది అంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాటిచ్చారంట..! ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..

New Update
రెస్టారెంట్ బిల్లు కట్టకుండా వెళ్ళిపోయిన ట్రంప్

Trump promise free food for all in restaurant leaves without paying bill

ఆహారం కొనిస్తానని ట్రంప్ హామీ

రెస్టారెంట్‌లో బిల్లు కట్టకుండా వెళ్లిపోయారని ట్రంప్ తాజా వార్త నెట్టింట విపరీతంగా ట్రోలింగ్ అవుతుంది. ఇటీవల మియామీలోని ఓ క్యూబన్ రెస్టారెంట్‌కు వెళ్లిన ట్రంప్, అక్కడ తనను చూసేందుకు వచ్చిన వారికి తానే ఆహారం కొనిస్తానని హామీ ఇచ్చారు. కానీ, బిల్లు చెల్లించకుండా ట్రంప్ వెళ్లిపోయారంటూ కథనాలు వచ్చాయి.

ఓ క్యూబా దేశ వంటకాలు సర్వ్ చేసే రెస్టారెంట్‌కు ట్రంప్

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌, ఓ హోటల్‌లో బిల్లు చెల్లించకుండానే వెళ్లిపోయారట. ఇటీవల ఆయన మియామీలోని ఓ క్యూబా దేశ వంటకాలు సర్వ్ చేసే రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ తనను చూసేందుకు వచ్చిన వారికి తానే ఆహారం కొనిస్తానని మాటిచ్చారట. ఆ తరువాత బిల్లు చెల్లించకుండానే వెళ్లిపోయారని అక్కడున్న కొందరు తెలిపారు. దీంతో, ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ట్రంప్‌ను ట్రోల్ చేస్తూ చెడుగుడు ఆడుకుంటున్నారు.

కచ్చితంగా ఆ రెస్టారెంట్‌కు వస్తా

అయితే, ట్రంప్ వర్గం మాత్రం ఈ వార్తలను ఖండించింది. ట్రంప్ వెళ్లిపోయిన వెంటనే రెస్టారెంట్‌లోని వారు కూడా ఆహారం ఆర్డర్ చేయకుండానే వెళ్లిపోయారని ఆయన తరఫు ప్రతినిధి మీడియాకు తెలిపారు. అయితే, వారు పార్సెల్ చేయించుకున్న ఆహారానికి ట్రంప్ బృందం బిల్లు కట్టిందని చెప్పారు. తనకు అద్భుత ఆతిథ్యమిచ్చిన రెస్టారెంట్ నిర్వాహకులకు ట్రంప్ ధన్యవాదాలు చెప్పారని అన్నారు. మరోమారు కచ్చితంగా ఆ రెస్టారెంట్‌ను సందర్శిస్తారని తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు