Trisha : 'యానిమల్' పై త్రిష పోస్ట్.. నెట్టింట్లో వైరల్ ..!

సందీప్ వంగ దర్శకత్వంలో రణబీర్ నటించిన చిత్రం యానిమల్. ఇప్పటికే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. ఇటీవలే నటి త్రిష 'కల్ట్ మూవీ' అని సినిమా పై చేసిన పోస్ట్ నెట్టింట్లో చర్చగా మారింది. నెటిజన్ల విమర్శలను దృష్టిలోపెట్టుకొని పోస్ట్ ను తొలగించారు.

New Update
Trisha : 'యానిమల్' పై త్రిష పోస్ట్.. నెట్టింట్లో వైరల్ ..!

Trisha Post on Animal Movie: బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) డైరెక్టర్ సందీప్ వంగ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం "యానిమల్". ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో యానిమల్ ఫీవర్ నడుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ అందుకుంది. సినిమాలో వైలెన్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఫాదర్ ఎమోషన్ చాలా బాగా చూపించారని ప్రశంశలు వచ్చాయి. ఈ సినిమా చూసిన పలువురు ప్రముఖ సెలెబ్రెటీలు సినిమా చాలా బాగుందని ప్రశంశల వర్షం కురిపించారు.

publive-image

అయితే తాజాగా ఈ సినిమా పై నటి త్రిష చేసిన ఓ పోస్ట్ నెట్టింట్లో చర్చగా మారింది. త్రిష యానిమల్ పోస్టర్ షేర్ చేస్తూ.. కల్ట్ మూవీ అని సోషల్ మీడియాలో తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు పలు రకాలుగా విమర్శలు చేస్తున్నారు. ఇటీవలే నటి త్రిష పై తమిళ నటుడు మన్సూర్ ఆలీఖాన్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ విషయంలో నటి త్రిష మహిళల గౌరవం గురించి ఘాటుగా స్పందించారు. ఇది ఇలా ఉండగా.. త్రిష 'యానిమల్' గురించి 'కల్ట్ మూవీ' అని పోస్ట్ పెట్టడంతో నెటిజన్లు అసహనం వ్యక్తం చేశారు. మన్సూర్ అలీఖాన్ వివాదంలో మహిళల గౌరవం గురించి అంతగా మాట్లాడిన త్రిష.. మహిళలను తక్కువగా చూపించే ఇటువంటి సినిమాలను ప్రశంసించడం ఏమీ బాగాలేదని విమర్శించారు. ఈ పోస్ట్ పై నెటిజన్ల నుంచి వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని తన సోషల్ మీడియాలో పోస్ట్ తొలగించినట్లు తెలుస్తోంది.

Trisha

Also Read: Double ISmart: సూపర్ అప్డేట్ ఇచ్చిన.. డబుల్ ఇస్మార్ట్ టీమ్..!

#trisha-post-on-animal-movie #animal-movie
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు