స్టార్ నటి త్రిషపై ప్రముఖ తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన కాంట్రవర్సీ కామెంట్స్ చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. కాగా దేశవ్యాప్తంగా సినీ అభిమానులను మన్సూర్ ను తిట్టిపోస్తున్నారు. మహిళలంటే కనీస గౌరవం లేదంటూ మండిపడుతున్నారు. త్రిష ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా మన్సూర్ కు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తూ దారుణమైన మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. అంతేకాదు పలువురు నటీమణులు త్రిషకు సపోర్టుగా నిలుస్తూ ఇలాంటి వాళ్లను ఇండస్ట్రీనుంచి పూర్తిగా బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ ఇలాంటి మాటలు సహించలేమని అతనికి వార్నింగ్ ఇచ్చింది.
Also read :విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంలో కొత్త కోణాలు.. నాని ఏం చెప్పాడంటే
ఈ మేరకు ' ఈ విషయాన్ని మేము చాలా సీరియస్‌గా తీసుకున్నాం. మన్సూర్ వ్యాఖ్యలు మహిళలపై హింసను ప్రేరేపించేలా ఉన్నాయి. ఇలాంటి అసభ్యకరమైన మాటల్ని ఏమాత్రం సహించేదిలేదు.ఐపీసీ సెక్షన్ 509బీ తో పాటు సంబంధిత సెక్షన్ల కింద మన్సూర్ అలీఖాన్‌పై కేసు నమోదు చేయాలని తమిళనాడు డీజీపీని ఆదేశించాం’ అని జాతీయ మహిళా కమిషన్ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా మహిళా కమిషన్ చర్యపై నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇదిలావుంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మన్సూర్ అలీఖాన్ ‘లియో’ చిత్రంలో త్రిషతో ఓ సన్నివేశం గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ‘గతంలో నేను చాలా రేప్ సీన్లలో నటించా. ‘లియో’ చిత్రంలో ఆఫర్ వచ్చినప్పుడు త్రిషతో రేప్ సీన్ ఉంటుందని అనుకున్నా. అలాంటి సీన్ లేకపోవడం బాధగా అనిపించింది’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఇక దీనిపై ఘాటుగానే స్పందించిన త్రిష.. ఆయన వ్యాఖ్యలను ఖండించారు. ఇకపై అతనితో నటించేది లేదని తేల్చి చెప్పారు. ఇలాంటి వారి వల్లే మానవాళికి చెడ్డపేరు వస్తుందని, లియో చిత్రంలో అతడితో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకోనందుకు ఆనందంగా ఉందని త్రిష చెప్పుకొచ్చారు.