పల్నాడు జిల్లాలో ఆస్తి కోసం ట్రిపుల్ మర్డర్‌

ఆస్తి కోసం రక్త సంబంధీకులైన ముగ్గురిని పోట్టన పెట్టుకున్న ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో పిన్ని, తమ్ముడు, చెల్లిని దారుణంగా చంపారు. అయితే ధూళిపాళ్లకు చెందిన ముగ్గురు ఉపాధి నిమిత్తం సత్తెనపల్లిలో స్థిరపడింది. గ్రామంలో ఉన్న రెండు ఎకరాల పొలం కోసం దారుణంగా హత్య చేయడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.

New Update
పల్నాడు జిల్లాలో ఆస్తి కోసం ట్రిపుల్ మర్డర్‌

Triple murder for property in Palnadu district

పొలం కోసం హత్య

పల్నాడు జిల్లా ధూళిపాళ్ల ట్రిపుల్ మర్డర్‌పై ఎస్పీ రవిశంకర్‌రెడ్డి కామెంట్స్ చూశారు. పెదమీర్సా, చినమీర్సా అన్నదమ్ములు కొంతకాలం క్రితం చనిపోయారని.. చినమీర్సా భార్య కరీమున్నీసాకు కుమార్తె మౌలాబి, కొడుకు రెహమాన్ ఉన్నారని తెలిపారు. చినమీర్సా పేరుపై ఉన్న 2 ఎకరాల పొలం అక్రమంగా  తీసుకోవాలని భావించి.. పిన్ని కరీమున్నీసా, తమ్ముడు రెహమాన్, చెల్లి మౌలాబీని చంపి పొలం పొందాలని హత్యకు కుట్ర పన్నాడని ఎస్పీ రవిశంకర్‌రెడ్డి వివరించాడు. ఖాసిం ముందుగా తన కొడుకును వెంటపెట్టుకుని రెహమాన్‌ను సత్తెనపల్లి శివారుకు తీసుకెళ్లి గొంతునులిమి హత్యచేశాడు.అనంతరం ధూళిపాళ్ళ వెళ్లి కరీమున్నీసా, మౌలాబిని బలమైన ఆయుధంతో కొట్టి చంపేశాడని తెలిపారు. అనంతరం స్కూటీపై కొడుకు జాకీర్‌తో పరారయ్యాడు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నామని.. హత్యలో ఖాసిం కొడుకు జాకీర్ పాత్ర కూడా ఉందని పోలీసులు తెలిపారు.

ప్లాన్‌ ప్రకారమే దాడి

పెద్దమీర్సా కొడుకు ఖాసిం ఆ పొలంపై కన్నేసి..పొలంలో సగభాగం ఇవ్వాలని తరచూ గొడవ పడేవాడు. ఖాసిం తన కుమారుడైన బాలుడితో కలిసి సత్తెనపల్లి నుంచి ధూళిపాళ్లకు బయలుదేరాడు. దారిలో ఎదురైన రహమాన్​పై దాడి చేసి చంపేసి, మృతదేహాన్ని గోనె సంచిలో ఉంచి ఓ దాబా వెనుక గుంతలో పడేశాడు. అనంతరం రహమున్నీసా ఇంటికి వెళ్లి, కర్రలతో దాడి చేశాడు, అడ్డొచ్చిన ఆమె కుమార్తె మాలింబీని విచక్షణారహితంగా కొట్టాడు. రహీమున్నీసా తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందారు. గాయపడిన మాలింబీని సత్తెనపల్లిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. దాడి అనంతరం ఖాసిం, ఆయన కుమారుడు పరారయ్యారు. పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. అనంతరం గుంతలో పడేసిన రహమాన్ మృతదేహాన్ని గుర్తించారు.

కుటుంబానికి అండగా..

రహీమున్నీసా పెద్ద కుమారుడు అబ్దుల్ జబ్బార్, రెండో కొడుకు రహమాన్ డిగ్రీ చదివారు. కుమార్తె మాలింబీ చదువు మధ్యలోనే ఆగింది. అబ్దుల్ జబ్బార్ రక్షణదళంలో కొలువుకు ఎంపికైనా వెళ్లలేదు. తల్లిదండ్రులకు దూరంగా ఉంటే వారి బాగోగులు చూసుకోవడం కష్టమని భావించి.. ఉద్యోగం వదులుకున్నాడు. వ్యవసాయం చేస్తూ కుటుంబానికి అండగా ఉండేవాడు. నాలుగేళ్ల కిందట చిన్న మీర్సా అనారోగ్యంతో చనిపోయారు. పిల్లలకు పెళ్లికాలేదని రహిమున్నీసా బాధపడేవారు. తొలుత చెల్లి మాలింబీకి పెళ్లిచేయాలని జబ్బార్ సంబంధాలు చూసినా కుదరలేదు. ఏడాదిన్నర క్రితం కండరాల వ్యాధితో జబ్బార్ మరణించడం ఆ కుటుంబాన్ని తీవ్ర వేదనకు గురిచేసింది. రెండో కుమారుడు.. రహమాన్ సత్తెనపల్లిలోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఉద్యోగం చేస్తూ కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. వీరి పొలంపై కన్నేసిన ఖాసిం.. ఇప్పుడు ఆ కుటుంబంలోని ముగ్గురిని హతమార్చాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు