AP: ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మమ్మల్ని కాపాడాలి: గ్రామస్తులు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తమను కాపాడాలని నెల్లూరు జిల్లా పంచెడు గ్రామంలోని గిరిజనులు వేడుకున్నారు. టీడీపీ నాయకుడు సూరా శ్రీనివాసుల రెడ్డి తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన దాష్టికాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. By Jyoshna Sappogula 07 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ నెల్లూరు New Update షేర్ చేయండి Nellore: ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అనుచరుడు, టీడీపీ నాయకుడు సూరా శ్రీనివాసుల రెడ్డి దాష్టికాలపై నెల్లూరు జిల్లా పంచెడు గ్రామంలోని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూరా శ్రీనివాసుల రెడ్డి, వృద్ధ గిరిజనుడైన మావిళ్ళ నాగయ్యపై అబద్ధపు ఆరోపణలు చేసి పోలీసులతో చిత్రహింసలు పెట్టించాడని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ అవమానంను తట్టుకోలేక నాగయ్య పురుగు మందు తాగి ఆత్మహత్యయత్ననికి పాల్పడ్డాడు. Also Read: చీరాలలో మృతుని బంధువుల నిరసన.. ప్రభుత్వం న్యాయం చేయాలని.. గిరిజనుల పేరిట సూరా శ్రీనివాసులరెడ్డి అయన భార్య పొదుపు రుణాలు తీసుకొని తిరిగి బ్యాంకుకు కట్టలేదని..ఈ విషయంపై ఎన్నికల సమయంలో ప్రశ్నించినందుకు తనపై పోలీసులతో దాడులు చేయించి, తనపై కక్ష తీర్చుకుంటున్నాడని నాగయ్య అవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ అవమానాల, చిత్రహింసలు భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్ననికి పాల్పడ్డానన్నారు. Also Read: దారుణం.. భార్యను కత్తితో నరికి చంపిన భర్త..! సూరా శ్రీనివాసులరెడ్డి దళితుల దగ్గర అప్పులు తీసుకొని ఎగకొట్టడం పరిపాటిగా మారిందని.. నెల్లూరు చింతరెడ్డిపాళెం కాపురాస్తుడు దారా రమణయ్య దగ్గర రూ. 30 లక్షల తీసుకొని తిరిగి కట్టనందున దళితుడైన రమణయ్య మానసిక హింసతో బాధపడుతున్నాడన్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తమను కాపాడాలని, టీడీపీ నాయకుడు సూరా శ్రీనివాసుల రెడ్డిపై చర్యలు తీసుకోవాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. #nellore మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి