పెళ్లి కొడుకా మజాకా..! తగ్గేదెలే... ఏకంగా 51 ట్రాక్టర్లతో ఊరేగింపుగా వచ్చిన వరుడు.. By Shareef Pasha 14 Jun 2023 in వీడియోలు వైరల్ New Update షేర్ చేయండి పెళ్లి అంటే లైఫ్‌లాంగ్ గుర్తుండేలా చేసుకోవాలనుకుంటారు. కొందరు.. మరికొందరైతే అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చెప్పుకునేలా జాంజాం అనేలా ఉండాలని ఎంత ఖర్చైనా సరే తగ్గేదేలే అంటుంటారు. ఒకప్పుడు పెళ్లి వేడుకలకు, నేటి తరం పెళ్లిళ్లకు చాలా తేడా ఉంది. నేటి రోజుల్లో పెళ్లి వేడుకల విషయంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆలోచిస్తున్నారు. జీవితంలో ఒకేసారి చేసుకునే ఒక మధురమైన జ్ఞాపకం కావడంతో పెళ్లిని మరింత స్పెషల్‌గా మార్చుకోవడానికి ప్రతి ఒక్కరు కొత్తగా ఆలోచిస్తున్నారు. అందులోనూ ఇటీవల కాలంలో వధూవరులు ఇద్దరు డాన్స్ చేస్తూ పెళ్లి మండపంలోకి ఎంట్రీ ఇవ్వడం ట్రెండ్ గా మారిపోయింది. ఇక ఇలాంటిదే ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇదిలావుంటే .... రాజస్థాన్‌లోని వరుడి ఇంటికి 51 కిలోమీటర్ల దూరంలో ఉన్న వధువు గ్రామానికి ఊరేగింపుగా బయలుదేరారు వరుడి కుటుంబం. ఏకంగా 51 ట్రాక్టర్లలో 200 మందికి పైగా ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు క్యూలో ఉండడంతో స్థానికులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. అందుకే ప్రస్తుతం ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. ఇక.. అసలు వివరాల్లోకి వెళితే... రాజస్థాన్‌లోని బార్మర్‌లో జరిగిన ఒక వివాహ ఊరేగింపు ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. ఈ వివాహ ఊరేగింపులో అన్ని ఆకట్టుకునే విశేషాలే కనిపించాయి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. 51 ట్రాక్టర్లలో పెళ్లి ఊరేగింపుగా బయల్దేరింది. అందులో ఒక ట్రాక్టర్ వరుడు స్వయంగా నడుపుతూ వచ్చాడు. గూడమలాని గ్రామానికి చెందిన ప్రకాష్ చౌదరికి రోలి గ్రామానికి చెందిన మమతతో వివాహమైంది. సోమవారం ఉదయం వరుడి ఇంటికి 51 కిలోమీటర్ల దూరంలోని రోలి గ్రామానికి ఊరేగింపు బయలుదేరింది. వరుడు ప్రకాష్ చౌదరి మాట్లాడుతూ..తమది వ్యవసాయ కుటుంబమని, ఇంట్లో అందరూ వ్యవసాయం చేస్తారని చెప్పాడు. రైతు గుర్తింపు ట్రాక్టర్. మా నాన్నగారి ఊరేగింపు కూడా ట్రాక్టర్‌తోనే జరిగిందని, తన పెళ్లి ఊరేగింపును ట్రాక్టర్ల జరుపుకోవాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. అందుకే ఇలా వెరైటీగా 51 ట్రాక్టర్లతో ఊరేగింపు సాగుతోందని తెలిపారు. వరుడి తండ్రి జేతారాం మాట్లాడుతూ..భూమి పుత్రుడికి ట్రాక్టరే హోదా కల్పిస్తుందని అన్నారు. మా నాన్న, తాతయ్యల పెళ్లి ఊరేగింపు ఒంటెలపై జరిగింది. మా కుటుంబంలో ఇప్పటికే 20-30 ట్రాక్టర్లు ఉన్నాయి. నా రైతు స్నేహితులు కలిసి మొత్తం 51 ట్రాక్టర్లతో ఊరేగింపుగా బయలుదేరారని తెలిపారు. https://twitter.com/ANI_MP_CG_RJ/status/1668772539898929153?cxt=HHwWgoDRuZLy1aguAAAA #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి