TREIRB RESULTS: తెలంగాణ సంక్షేమ గురుకులాలకు సంబంధించి టీజీటీ పోస్టుల రిజల్ట్స్ (TREIRB TGT 2024 Results) రిలీజ్ అయ్యాయి. ఇటీవల 4006 టీజీటీ పోస్టులకుగానూ రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలను రిక్రూట్మెంట్ బోర్డు విడుదలచేసింది. మెరిట్ లిస్ట్ లో ఉన్న అభ్యర్థులకు ఫిబ్రవరి 27, 28 తేదీల్లో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేయనున్నట్లు గురుకుల నియామక బోర్డు అధికారులు తెలిపారు.
సర్టిఫికేట్ల పరిశీలన..
ఈ మేరకు పరీక్షల్లో మెరిట్ సాధించిన అభ్యర్థులు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని బంజారాభవన్, ఆదివాసీ కుమురంభీం భవన్, పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కు హాజరు కావాలని కోరారు. సర్టిఫికేట్ల పరిశీలన ముగిసిన వెంటనే రెండు రోజుల్లో ఫైనల్ లిస్ట్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 27న- బంజారాభవన్‌లో ఇంగ్లిష్ సబ్జెక్టు, ఆదివాసీ భవన్‌లో బయోసైన్స్, మధ్యాహ్నం జనరల్ సైన్స్ పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో సోషల్ స్టడీస్, మధ్యాహ్నం తెలుగు సబ్జెక్టు అభ్యర్థుల సర్టిఫికేట్లను వెరిఫికేషన్ చేయనున్నట్లు ప్రకటించారు.అలాగే ఫిబ్రవరి 28న- బంజారాభవన్‌లో గణితం అభ్యర్థులు, ఆదివాసీ భవన్‌లో ఫిజికల్ సైన్స్ అభ్యర్థులకు, పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఉదయం హిందీ, మధ్యాహ్నం హిందీ, ఉర్దూ, సంస్కృతం అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: India: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపుకు ముహూర్తం ఫిక్స్!
డిగ్రీ లెక్చరర్ ఫలితాలు..
అలాగే 2717 జూనియర్, డిగ్రీ లెక్చరర్ పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షల తుది జాబితాను(TREIRB TGT JL DL Final List) విడుదల చేశారు. ఆదివారం ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించినా సాంకేతిక కారణాలతో సోమవారానికి వాయిదా పడిందని చెప్పారు. గురుకుల జూనియర్ కళాశాలల్లో 1,924 పోస్టులు, డిగ్రీ కాలేజీల్లో 793 లెక్చరర్ పోస్టులకు 2023 ఆగస్టులో రాతపరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా ఈ పరీక్షలో మెరిట్ ఆధారంగా 1:2 నిష్పత్తిలో జాబితాలను నియామక బోర్డు ఈ నెల రెండో వారంలో విడుదల చేసింది. మెరిట్ జాబితా ఆధారంగా ఈ నెల 19, 20 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన, డెమో తరగతులు నిర్వహించింది. వీటిలో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా గురుకుల నియామక బోర్డు తుది ఫలితాలను వెల్లడించనుంది. దీంతో పాటు దివ్యాంగుల కేటగిరీకి చెందిన తుది ఫలితాలు మరో రెండు రోజుల్లో ప్రకటించనున్నట్లు తెలిపారు.
అధికారిక వెబ్‌సైట్ https://treirb.cgg.gov.in/home నందు ఫలితాలు అందుబాటులో ఉంచింది.