Ayodhya: తెలుగు రాష్ట్రల ప్రజలకు గుడ్‌న్యూస్... హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు.. ఎప్పుడంటే! ప్రతి శుక్రవారం హైదరాబాద్-అయోధ్యకు ప్రత్యేక రైలు వెళ్లనుంది. యశ్వంత్‌పూర్-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి శుక్రవారం ఉ:10:40 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్ చేరుతుంది. అటు తమిళనాడులోని రామేశ్వరం నుంచి విజయవాడ మీదుగా ప్రతి సొమవారం శ్రద్ధ సేతు ఎక్స్‌ప్రెస్ అయోధ్యకు వెళ్తుంది. By Trinath 16 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Good News for Telugu States People: వందేళ్ల తర్వాత మళ్లీ అయోధ్య(Ayodhya)లో బలరాముడికి పట్టాభిషేకం చేసే సమయం ఆసన్నమైంది. జనవరి 22న రామమందిరంలో బలరాముడి ప్రాణప్రతిష్ఠకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓ వైపు రామలల్ల స్థాపనకు ఏర్పాట్లు పూర్తి అవుతుంటే మరోవైపు దేశవ్యాప్తంగా భక్తుల్లో ఉత్సాహం నెలకొంది. త్రేతాయుగ వైభవాన్ని మరోసారి చూసేందుకు యావత్ దేశం ఎదురుచూస్తోంది. అయోధ్య వెంటనే గుర్తుకు వచ్చేది శ్రీరామ మందిరమే. హిందువుల హృదయాల్లో నిత్యం నిలిచే అయోధ్యలోని శ్రీరామ మందిరంలో బలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేశంలోని అతిరథులు వస్తున్నారు. ఇక దేశం నలుములల నుంచి భక్తులు అయోధ్యకు తరలిరానున్నారు. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. శుక్రవారం ఉదయం: ప్రతి శుక్రవారం హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు వెళ్లనుంది. రామమందిర్ దర్శనానికి వెళ్తున్న ప్రయాణికుల కోసం హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రతి శుక్రవారం రైలు సదుపాయం కల్పించారు. ఈనెల 22న అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవం జరుగనుండడంతో యశ్వంత్‌పూర్-గోరఖ్‌పూర్ (నెంబర్ 15024) ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి గురువారం రాత్రి 11.40 గంటలకు యశ్వంత్ పూర్‌లో బయలుదేరి శుక్రవారం ఉదయం 10.40 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్ చేరుతుంది. 10.50 గంటలకు కాచి గూడలో బయలుదేరి కాజీపేట, బలార్షా, నాగా పూర్, ఇటార్సీ, భోపాల్, ఝాన్సీ, కాన్పూర్, లక్నో మీదుగా శనివారం సాయం త్రం 4.25 గంటలకు అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ చేరు కుంటుంది. అక్కడి నుంచి గోరఖ్‌పూర్ వెళుతుందని రైల్వే అధికారులు తెలిపారు. శ్రద్ధ సేతు ఎక్స్‌ప్రెస్ (Sethu Express) అలాగే తమిళనాడు లోని రామేశ్వరం నుంచి విజయవాడ (Vijayawada) మీదుగా శ్రద్ధ సేతు ఎక్స్‌ప్రెస్ (22613) కూడా అయోధ్యకు వెళ్తుంది. ఈ రైలు విజయవాడలో ప్రతి సోమవారం రాత్రి 8.10 గంటలకు బయల్దేరి 1813 కిలోమీటర్లు ప్రయాణించి బుధవారం తెల్లవారుజామున 4.00 అయోధ్య జంక్షన్‌కు చేరుకుంటుంది. గూడూరు, విజయవాడ, వరంగల్ స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. 100 రోజుల పాటూ వెయ్యి ప్రత్యేక రైళ్ళు అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు జనం పోటెత్తుతున్నారు. దేశ నలుమూలల నుంచి భారీ ఎత్తున జనం తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు చెందిన భక్తులు రైలు మార్గంలో అయోధ్య (Ayodhya) చేరుకునేందుకు వీలుగా మరిన్ని రైళ్ళు పెంచుతామని చెబుతోంది రైల్వేశాఖ. రామ మందిరం ప్రారంభం తర్వాత 100 రోజుల పాటూ దేశంలోని పలుచోట్ల నుంచి వెయ్యి రైళ్ళు ప్రత్యేకంగా నడుపుతామని తెలిపింది. దీనికి సబంధించిన ప్రకటనను తర్వరలోనే విడుదల చేస్తామని అంటోంది. ఎక్కడెక్కడ నుంచి ఏఏ రైళ్ళు వెళతాయో విరాలతో సమా తెలియజేస్తామని చెబుతోంది. Also Read: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ప్రయత్నించిన వివేక్ రామస్వామి ఎవరు? WATCH: #hyderabad #ayodhya #trains మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి