West Bengal: మెడికల్‌ విద్యార్థిని దారుణ హత్య...!

పశ్చిమ బెంగాల్‌లో దారుణం జరిగింది. కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మహిళా పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ శవమై కనిపించింది. సెమినార్ హాల్‌లో నగ్న మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆస్పత్రి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

New Update
Wife Murder: అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త

West Bengal: పశ్చిమ బెంగాల్‌లో దారుణం జరిగింది. కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మహిళా పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ శవమై కనిపించింది. సెమినార్ హాల్‌లో నగ్న మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆస్పత్రి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థిని హత్య విషయం తెలుసుకున్న వెంటనే బంధువులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హస్పిటల్‌ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. అలాగే పలు పార్టీల నేతలు కూడా మద్దతుగా నిలిచారు. తమ బిడ్డ పై అత్యాచారం చేసి అన్యాయంగా చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు, తమ బిడ్డకు న్యాయం చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

ఈ ఘటన గురించి తెలుసుకున్న పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. బాధితురాలి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.మృతురాలు ఛాతీ మెడిసిన్ విభాగంలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. గురువారం రాత్రి విధుల్లో ఉంది. శరీరంపై గాయాల గుర్తులు ప్రత్యక్షమయ్యాయి. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గురువారం రాత్రి డ్యూటీలో ఉన్న సిబ్బందిని విచారిస్తున్నారు. అసలేం జరిగిందన్న అంశంపై వాకబు చేస్తున్నారు. కేసును కప్పిపుచ్చేందుకు కుట్ర జరుగుతోందని బాధితురాలి తండ్రి ఆరోపించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ట్రైనీ డాక్టర్ మృతదేహాన్ని ఎమర్జెన్సీ భవనంలోని సెమినార్ హాల్‌లో తోటి విద్యార్థులు కనుగొన్నారని తెలిపారు. గత రాత్రి ఆమెతో డ్యూటీలో ఉన్న వైద్యులు, నర్సులు, ఇతరులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు వెల్లడించారు. రిపోర్టు రాగానే అసలు విషయాలు బయటకు వస్తాయని తెలిపారు. ఆమె చెంపలు, ముక్కు చుట్టూ, పెదవులు, కనుబొమ్మల మధ్య మరియు మెడపై గీతలు ఉన్నాయన్నారు. ఏదో పోరాటం జరిగినట్లుగా కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే.. ఆమెపై లైంగిక వేధింపులు జరిగాయా.. లేదంటే హత్యకు గురైందా? అనేది పోలీసులకు అర్థమవుతుందని చెప్పారు.

ఆసుపత్రి వైద్యుడు ఒకరు మాట్లాడుతూ.. బాధితురాలు సుమారు అర్ధరాత్రి 2 గంటలకు తన జూనియర్‌లతో కలిసి ఆహారం తీసుకున్నట్లు తెలిపారు. ఆ తరువాత ఆమె విశ్రాంతి తీసుకోవడానికి ప్రత్యేకంగా రూమ్ లేకపోవడంతో ఆమె సెమినార్ గదికి వెళ్లిందన్నారు. ఉదయం చూస్తే ఆమె మృతదేహం లభించిందని చెప్పారు.

Advertisment
తాజా కథనాలు