యాదాద్రి జిల్లాలో రైలు ప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం

ఈమధ్య రైలు ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. దీంతో రైలు ప్రయాణం చేయాలంటే ప్రయాణికులు భయం పట్టుకుంది. ఎప్పుడు ఏ ప్రమాదానికి గురి అవుతమనే భయంతో బిక్కుబిక్కమంటూ ప్రయాణికులు జర్నీ చేస్తున్నారు. తాజాగా యాదాద్రిలో ప్రాణాలతో బయటపడ్డారు రైలు ప్రయాణికులు.

New Update
యాదాద్రి జిల్లాలో రైలు ప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం

మరో రైలు ప్రమాదం

తెలంగాణలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. యాదాద్రి జిల్లా వద్ద ఫలక్ నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. దీనితో రైలును పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్య రైలును నిలిపివేశారు. ఈ ప్రమాదంలో మూడు రైలు బోగీలు దగ్ధం అయ్యాయి. అయితే ప్రయాణికులు అప్రమత్తమై రైలు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం ధాటికి పెద్ద ఎత్తున పొగలు వ్యాపిస్తున్నాయి. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హౌరా నుంచి సికింద్రాబాద్‌కు ఈ రైలు వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.

Train accident in Yadadri district

వరస ప్రమాదాలు ..

యావత్​ దేశాన్ని షాక్​కు గురిచేసిన ఒడిశా రైలు ప్రమాదం ఘటన జరిగిన విషయం తెలిసిందే. బెంగళూరు- హౌరా సూపర్​ఫాస్ట్​ ఎక్స్​ప్రెస్​, షాలిమార్​- చెన్నై సెంట్రల్​ కోరమండల్​ ఎక్స్​ప్రెస్​, గూడ్స్​ రైలు.. బాలాసోర్​లోని బహనాగా బజార్​ స్టేషన్​కు సమీపంలో ప్రమాదానికి గురయ్యాయి. ప్యాసింజర్​ రైళ్లల్లో సుమారు 2500 మంది ప్రయాణికులు ఉండగా.. 288మంది ప్రాణాలు కోల్పోయారు. 1000కిపైగా మంది గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలను కనుగొనేందుకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అశ్విని వైష్ణవ్​, ఒడిశా సీఎం నవీన్​ పట్నాయక్​, బంగాల్​ సీఎం మమతా బెనర్జీతో పాటు అనేక మంది నేతలు ఘటనాస్థలాన్ని పరిశీలించి తెలిసిందే. మృతుల కుటుంబసభ్యులను, క్షతగాత్రులను పరామర్శించారు. అప్పటి నుంచి ఏలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు దక్షణ మధ్య రైల్వే చర్యలు తీసుకున్నపట్టికి ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు