Chandrababu Bail: ఈరోజు సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ 

ఏపీ స్కిల్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేయాలంటూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ పై ఈరోజు విచారణ జరగనుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన ఈ తరుణంలో సుప్రీంకోర్టు నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

New Update
Chandrababu: చంద్రబాబు బెయిల్ రద్దు.. విచారణ వాయిదా!

Chandrababu Bail: స్కిల్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అప్పట్లో ఏపీ సీఐడీ అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించిన విషయం తెలిసిందే. అయితే, తరువాత ఆయనకు కోర్టులో బెయిల్ (Chandrababu Bail)మంజూరు అయింది. అయితే, చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ ఫైల్ చేసింది. ఈ పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌ ధర్మాసనం చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ చేపట్టనుంది. 

గతంలో ఈ పిటిషన్ విచారణకు వచ్చినపుడు చంద్రబాబుకు బెయిల్ రద్దు ఎందుకు చేయాలి అనే విషయంపై గట్టిగా తన వాదనలు వినిపించింది. ముఖ్యంగా చంద్రబాబు కుటుంబం అధికారులను బెదిరిస్తోందని చెప్పిన ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వెంటనే బెయిల్(Chandrababu Bail) రద్దు చేయాలని కోరారు. దీనికి సంబంధించి అన్ని  వివరాలతో ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌ దాఖలు చేసినట్లు జస్టిస్‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌ ధర్మాసనానికి న్యాయవాదులు తెలిపారు. 

అయితే, ప్రభుత్వం తరఫున సమర్పించిన ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌ పై తాము సమాధానం ఇవ్వాలని అనుకుంటున్నట్టు చంద్రబాబు తరఫు న్యాయవాది హరీష్ సాల్వే కోర్టుకు తెలిపారు. దీంతో విచారణను మూడువారాల పాటు కోర్టు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు సుప్రీం కోర్టు ధర్మాసనం ముందుకు ఈ కేసు విచారణకు రానుంది. 

Also Read: రోడ్ షోల నిర్వహణపై ఎలక్షన్ కమిషన్ నయా రూల్.. ఆ రోజుల్లోనే.. 

ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ.. చంద్రబాబు కుటుంబం ఒక డైరీ పెట్టి... దానిలో అధికారుల పేర్లు నమోదు చేస్తున్నట్లు ప్రచారం చేస్తోందన్నారు. తాము అధికారంలోకి వస్తే అందరిపై చర్యలు తీసుకుంటామంటూ బెదిరిస్తున్నారని కోర్టుకు తెలిపారు. దీంతో ఈ పిటిషన్‌ ప్రధాన ఉద్దేశం ఏమిటని ప్రభుత్వ న్యాయవాదులను జస్టిస్‌ బేలా త్రివేది ప్రశ్నించగా.. బెయిల్‌(Chandrababu Bail) రద్దు చేయాలని కోరుతున్నట్లు ముకుల్‌రోహత్గి చెప్పారు. స్కిల్‌ కేసులో బెయిల్‌ మంజూరు తర్వాత... చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయని, నిందితుడి కుటుంబ సభ్యులు అధికారులను, దర్యాప్తు సంస్థను బెదిరిస్తున్నారనీ  ముకుల్‌ రోహత్గి కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా, వెంటనే బెయిల్‌ రద్దు చేయడానికి అనేక కారణాలు ఉన్నాయని, వెంటనే విచారణ చేపట్టాలని ముకుల్‌ రోహత్గి కోరారు. 

ప్రభుత్వం లేవనెత్తిన ప్రతి అంశానికి తాము సమాధానం ఇస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు(Chandrababu Bail) న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీంతో రెండు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అనంతరం మూడు వారాల తరువాత తదుపరి విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది. 

ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరుణంలో.. పార్టీలు ముమ్మరంగా ఎన్నికల సన్నాహాలు చేస్తున్న వేళ చంద్రబాబు బెయిల్(Chandrababu Bail) రద్దు పిటిషన్ విచారణకు రానుండడం ఆసక్తి రేపుతోంది. కోర్టు తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుంది అనే దానిపై పొలిటికల్ సర్కిల్స్ లో రకరకాలుగా అంచానాలు వేస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు