Khammam: కామేపల్లిలో విషాదం.. కారులో ఊపిరాడక బాలుడు మృతి

ఇంటి ఆవరణంలో ఉన్న కారు ఓ బాలుడ్ని బలి తీసుకుంది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. కారు ఎక్కి ఆడుకుంటుండగా ఒక్కసారిగా కారు డోర్‌ మూసుకుపోంది. ఎవరు చూడక పోవటంతో ఊపిరాడక పార్థు మృతి చెందాడు.

New Update
Khammam: కామేపల్లిలో విషాదం.. కారులో ఊపిరాడక బాలుడు మృతి

ప్రాణం తీసిన కారు

ఐదు సంవత్సరాల బాలుడు పార్ధు ఆడుకుంటూ కారులోకి వెళ్లి డోర్ వేసుకోవడంతో డోర్ లాక్ పడి  (car Door lock)  ఊపిరాడక బాలుడు మృతి చెందిన సంఘటన రుక్కి తండాలో చోటుచేసుకుంది. ఖమ్మం ( Khammam) జిల్లా కామేపల్లి మండలం రిక్కితండా (Rikkithanda)లో బానోత్ అశోక్ అనూష దంపతుల కుమారుడు పార్థూ (5) తల్లిదండ్రులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అశోక్‌, అనూష దంపతులకు ఇద్దరు చిన్నారులు. ఈ రోజు అంగన్‌వాడ్‌ స్కూల్‌కి విడిచి వెళ్లారు ఇద్దరు చిన్నారు. మధ్యాహ్నం దాటిన తర్వాత పార్థు ( Parthu)ను అశోక్‌ సోదరికి అప్పగించి వెళ్లింది అనూష. కొద్దిసేపటికి ఆడుకుంటూ బయటకు వెళ్లి ఇంటి ఎదుట పార్క్‌చేసి ఉన్న కారు డోర్‌ తీసుకొని లోపలికి వెళ్లాడు పార్థు.

ఊపిరాడక పార్థు మృతి

పార్ధు తమ ఇంటి ముందు ఆడుకుంటూ ఇంట్లో ఉన్న కారు (car)లోకి వెళ్లడంతో డోర్ లాక్ ( Door lock) అయింది. దీంతో ఊపిరాడక బాలుడు మృతి చెందాడు. సరైన సమయంలో తల్లిదండ్రులు గమనించకపోవడంతో పిల్లవాడి ప్రాణాలు పోయాయి. బాబు కనబడడం లేదని వెతికిన తల్లిదండ్రులు కారులో వచ్చి చూసేసరికి విగత జీవిగా పడి ఉన్నాడు. బాలుడిని చూసి హుటా హుటిన బయటికి తీసి చూసేసరికి అప్పటికే మృతి చెందాడు.

కన్నీరు మున్నీరు

విగత జీవిగా ఉన్న కుమారుని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న స్థానికులు సైతం కన్నీరు పెట్టుకున్నారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు