జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం.. పిడుగు పడి మహిళ మృతి

జోగులాంబ గద్వాల జిల్లా అమరవాయి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కూలీ పని కోసం వెళ్లిన మహిళపై పిడుగు పడటం ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

New Update
జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం.. పిడుగు పడి మహిళ మృతి

కూలీలపై పిడుగు పడ్డ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్‌ మండల పరిధిలోని అమరవాయి గ్రామంలో చోటు చేసుకుంది. కూలీలు పొలం వద్ద పనులు చేస్తున్న సమయంలో భారీ వర్షం కురిసింది. దీంతో ముగ్గురు కూలీలు పక్కనే ఉన్న చెట్టు కిందకు వెళ్లారు. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చెట్టుపై పిగుడు పడటాన్నిగమనించిన ఇతర కూలీలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్ధలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

మృతురాలు అమరవాయి గ్రామానికి చెందిన పావనిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పలువురు ప్రజా ప్రతినిధులు క్షతగాత్రులను పరామర్శించారు. కాగా వర్షం పడుతున్న సమయంలో ఎవరూ చెట్ల కిందకు వెళ్లవద్దని అధికారులు అనేక సార్లు చెప్పారు. అంతే కాకుండా ఉరుములు, మెరుపులు వస్తున్న సమయంలో కూడా పొరపాటున చెట్ల కింద ఉండొద్దని అంతే కాకుండా చెట్ల కింద ఉన్న వారు అక్కడి నుంచి వెళ్లాలని సూచించారు. పిడుగులు చెట్ల మీదనే పడే అవకాశాలు అధికంగా ఉండటంతో తలదాచుకుందామని చెట్ల కిందకు వెళ్లేవారు మరణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

కూలి పనుల కోసం వచ్చిన మహిళ పిడుగుపాటుకు గురై మృతి చెందడంతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి. ఇప్పటికైనా రైతులు, కూలీలు భారీ వర్షాలు పడే సమయంలో చెట్ల కిందకు వెళ్లొద్దని, పంట చేను వద్ద ఉండే షెడ్డులోకి వెళ్లాలని సూచించారు. వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తే ప్రజల కూలీ పనులకు వెళ్లకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు