Hyderabad: హైదరాబాద్ కు ప్రధాని మోదీ.. ఈ రూట్ లో ట్రాఫిక్ ఆంక్షలు..!

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ నేడు రాత్రి హైదరాబాద్ కు రానున్నారు. ఈ క్రమంలో బేగంపేట్ నుంచి రాజ్ భవన్ మార్గంలో రాత్రి 7.50 గంటల నుంచి 8.25 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

New Update
Hyderabad: హైదరాబాద్ కు ప్రధాని మోదీ.. ఈ రూట్ లో ట్రాఫిక్ ఆంక్షలు..!

Hyderabad: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలన్ని ప్రచారాలతో దూసుకుపోతున్నాయి. జాతీయ పార్టీల నేతలు తెలంగాణలో ప్రచారం చేయడానికి క్యూ కడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ నేడు రాత్రి  హైదరాబాద్ కు రానున్నారు. ఈ నేపథ్యంలో బేగంపేట్ నుంచి రాజ్ భవన్ మార్గంలో రాత్రి 7.50 నుంచి రేపు ఉదయం 8.25 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

Also Read: జనం కోసం పుట్టిన జనసేనాని నా తమ్ముడు.. పవన్ కోసం చిరంజీవి సంచలన వీడియో

బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, మోనప్ప ఐలాండ్, రాజ్ భవన్ వరకు వాహనాలను అనుమతి లేదని తెలిపారు. ప్రధాని మోదీ రేపు ఉదయం తిరిగి బేగంపేట్ ఎయిర్ పోర్ట్ కి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా రేపు ఉదయం 8.35 నుంచి 9.10 వరకు రాజ్ భవన్, మోనప్ప ఐలాండ్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట్ ఎయిర్ పోర్ట్ వరకు వెహికిల్స్ ను అనుమతించరని తెలుస్తోంది. ఈ సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాపిక్ పోలీసులు వెహికలర్స్ కి సూచించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు