Hyderabad: హైదరాబాద్ లో రేపు ఈ మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు..!

హైదరాబాద్ లో రేపు జరగబోయే మారథాన్‌ రన్‌ సందర్భంగా ఉదయం 4. 30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని అధికారులు వివరించారు. ఈ మారథాన్‌ నెక్లె్‌స్ రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజా నుంచి ప్రారంభమై ఎన్‌టీఆర్‌ మార్గ్‌, మీదుగా సాగుతుంది.

New Update
Traffic Restrictions : నేడు బక్రీద్‌..హైదరాబాద్‌ లో ఈ ఏరియాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు!

Hyderabad: హైదరాబాద్ లో రేపు జరగబోయే మారథాన్‌ రన్‌ సందర్భంగా హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో ఆదివారం ఉదయం 4. 30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని అధికారులు వివరించారు.మారథాన్‌ 10 కిలో మీటర్ల..ఫుల్‌ మారథాన్‌ 21 కిలో మీటర్లు నిర్వహిస్తారు.

ఈ మారథాన్‌ నెక్లె్‌స్ రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజా నుంచి ప్రారంభమై ఎన్‌టీఆర్‌ మార్గ్‌, ట్యాంక్‌ బండ్‌, సంజీవయ్య పార్క్‌, పీపుల్స్‌ ప్లాజా, ఖైరతాబాద్‌, రాజ్‌ భవన్‌ రోడ్‌, సోమాజిగూడ, పంజాగుట్ట ఫ్లై ఓవర్‌, ఎంజే కాలేజ్‌, ఎస్‌ఎన్‌టీ జంక్షన్‌, సాగర్‌ సొసైటీ, కేబీఆర్‌ పార్క్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్ట్‌, రోడ్‌ నెంబర్ 45, కేబుల్‌ బ్రిడ్జి, ఐటీసీ కోహినూర్‌, నాలెడ్జ్‌ సిటీ, మైహోం అబ్రార్‌, ఐకియా, బయోడైవర్సిటీ, టెలికాం నగర్‌, గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌, ఇందిరా నగర్‌, ఐఐఐటీ హైదరాబాద్ జంక్షన్‌ మీదుగా గచ్చిబౌలి జంక్షన్‌కు చేరుతుంది. దీంతో ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయని ట్రాఫిక్‌ పోలీసులు పేర్కొన్నారు.

Also Read: ఏపీలో మరో భారీ ప్రమాదం..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు