TS News : హైదరాబాద్ వాసులకు అలెర్ట్.. ఆ రూట్లలో నెల రోజులు ట్రాఫిక్ డైవర్షన్!

ఎంఎంటీఎస్​ ఫేజ్-2 ట్రాక్ పనుల కారణంగా తార్నాక, మల్కాజిగిరి రూట్లలో .. నెలరోజులు ట్రాఫిక్ ​డైవర్షన్స్​ ఉంటాయని హైదరాబాద్ సీపీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. నెలరోజుల పాటు ట్రాఫిక్ డైవర్షన్స్ కొనసాగుతాయని వాహనదారులు సహకరించాలని ఆయన కోరారు.

TS News : హైదరాబాద్ వాసులకు అలెర్ట్.. ఆ రూట్లలో నెల రోజులు ట్రాఫిక్ డైవర్షన్!
New Update

Traffic Diversion in Hyderabad: ఎంఎంటీఎస్​ ఫేజ్-2 ట్రాక్ పనుల కారణంగా సీతాఫల్​మండి-, లాలాగూడ, -మెట్టుగూడ, ఆలుగడ్డ బావి రూట్​లో జరుగుతున్న ఆర్ యూబీ నిర్మాణ పనుల కారణంగా ఈ నెల10 నుంచి మే 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ నగర సీపీ శ్రీనివాసరెడ్డి తెలిపారు.తార్నాక -మెట్టుగూడ, మల్కాజిగిరి – -మెట్టుగూడ మార్గాల్లో డెవర్షన్స్​ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

తార్నాక, లాలాపేట నుంచి సంగీత్ క్రాస్ రోడ్డు వైపుగా వెళ్లే వాహనదారులు తార్నాక- సీతాఫల్​ మండి ఫ్లైఓవర్ నుంచి చిలకలగూడ ఎక్స్ రోడ్డు మీదుగా మళ్లిస్తున్నట్లు తెలిపారు. అలాగే మల్కాజిగిరి, మీర్చాలగూడ, లాలాగూడ నుంచి సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలను తుకారాంగేట్​ఆర్​యూబీ, తుకారాంగేట్, వెస్ట్ మారేడ్ పల్లి సెయింట్​జాన్స్​రోటరీ మీదుగా సంగీత్​ క్రాస్​రోడ్స్, చిలకలగూడ క్రాస్​ రోడ్స్, సికింద్రాబాద్​వైపు మళ్లిస్తున్నట్లు చెప్పారు. నెల రోజుల పాటు డైవర్షన్స్​ కొనసాగుతాయని, వాహనదారులు సహకరించాలని కోరారు.

ఇది కూడా చదవండి: తిరుమలలో నకిలీ ఐఏఎస్..ఏకంగా వీఐపీ బ్రేక్ దర్శనం..కట్ చేస్తే కటకటాలపాలు..!

#traffic #construction #tarnaka #diversions #malkajigiriroutes #rub
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe