/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Traffic-1-jpg.webp)
Traffic Diversion in Hyderabad: ఎంఎంటీఎస్​ ఫేజ్-2 ట్రాక్ పనుల కారణంగా సీతాఫల్​మండి-, లాలాగూడ, -మెట్టుగూడ, ఆలుగడ్డ బావి రూట్​లో జరుగుతున్న ఆర్ యూబీ నిర్మాణ పనుల కారణంగా ఈ నెల10 నుంచి మే 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ నగర సీపీ శ్రీనివాసరెడ్డి తెలిపారు.తార్నాక -మెట్టుగూడ, మల్కాజిగిరి – -మెట్టుగూడ మార్గాల్లో డెవర్షన్స్​ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
తార్నాక, లాలాపేట నుంచి సంగీత్ క్రాస్ రోడ్డు వైపుగా వెళ్లే వాహనదారులు తార్నాక- సీతాఫల్​ మండి ఫ్లైఓవర్ నుంచి చిలకలగూడ ఎక్స్ రోడ్డు మీదుగా మళ్లిస్తున్నట్లు తెలిపారు. అలాగే మల్కాజిగిరి, మీర్చాలగూడ, లాలాగూడ నుంచి సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలను తుకారాంగేట్​ఆర్​యూబీ, తుకారాంగేట్, వెస్ట్ మారేడ్ పల్లి సెయింట్​జాన్స్​రోటరీ మీదుగా సంగీత్​ క్రాస్​రోడ్స్, చిలకలగూడ క్రాస్​ రోడ్స్, సికింద్రాబాద్​వైపు మళ్లిస్తున్నట్లు చెప్పారు. నెల రోజుల పాటు డైవర్షన్స్​ కొనసాగుతాయని, వాహనదారులు సహకరించాలని కోరారు.
ఇది కూడా చదవండి: తిరుమలలో నకిలీ ఐఏఎస్..ఏకంగా వీఐపీ బ్రేక్ దర్శనం..కట్ చేస్తే కటకటాలపాలు..!