Sankranti 2024: సంక్రాంతి స్పెషల్..చెక్కలు, నెలవంకలు, సున్నుండలు ఇలా చేస్తే ఆ టేస్ట్ అదుర్స్..!!

సంక్రాంతి పండుగ వచ్చేసింది. ఈ సమయంలో చేసే రకరకాల పిండి వంటకాలు భలే రుచిగా ఉంటాయి. ఒకటి కాదు రెండు కాదు వందలాది రకాల పిండివంటకాలను తయారు చేస్తారు. వాటిలో కొన్నింటి తయారీ విధానం తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

Sankranti 2024: సంక్రాంతి స్పెషల్..చెక్కలు, నెలవంకలు, సున్నుండలు ఇలా చేస్తే ఆ టేస్ట్ అదుర్స్..!!
New Update

సంక్రాంతి (Sankranti 2024)పండుగ వచ్చేసింది. సంక్రాంతి పండగ అనగానే పిండివంటలు గుర్తుకు వస్తాయి. సంక్రాంతి పండగకు రెండు మూడు రోజుల ముందు నుంచే ప్రతి ఇల్లు ఘుమఘుమలాడుతుంది. ఎన్నో వెరైటీలు నోరూరిస్తుంటాయి. వంటలతో ఆ ఇంట్లో సందడి నెలకొంటుంది. పిల్లాపాపల కేరింతలతో ఇళ్లలో పండగ వైభవం సంతరించుకుంటుంది. ప్రతి ఒక్కరూ..ఒక్కో రకం రుచులను చూస్తుంటారు. సంక్రాంతి పండుగల్లో వందల రకాల పిండి వంటకాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చెక్కలు:
సంక్రాంతికి చాలా మంది ఇళ్లలో చేసే పిండివంటకాల్లో ఒకటి చెక్కలు. పలు రకాల్లో వీటిని తయారు చేస్తారు. ఇప్పుడు సగ్గుబియ్యం చెక్కల తయారీ విధానం చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:
బియ్యం - 4 కప్పులు
పెసరపప్పుు- 2 కప్పులు
సగ్గుబియ్యం - 1 కప్పు
నవ్వులు -3 టేబుల్ స్పూన్స్,
జీలకర్ర- 1 టీస్పూన్
వెన్న- 1 స్పూన్
కారం, ఉప్పు- రుచికి సరిపడా
నూనె- వేయించడానికి కావల్సినంత.

తయారీ విధానం:
సగ్గుబియ్యం చెక్కలు తయారు చేసే ముందు బియ్యం, పెసరపప్పు, సగ్గుబియ్యాన్ని కలిపి మెత్తగా పిండి చేసుకోవాలి. అందులో నువ్వులు, జీలకర్ర, ఉప్పు, కారం, వెన్న వేసుకుని సరిపడా నీళ్లు పోసుకుంటూ కలపాలి. ముద్దలా అయిన ఈ పిండిని 5 నిమిషాలు పక్కన పెట్టాలి. తర్వాత చిన్న చిన్న చెక్కల్లా చేసుకుని వేడి నూనెలో వేసి ముదురు రంగు వచ్చేంత వరకు వేయిస్తే సరిపోతుంది.

నెలవంకల తయారీలా:
కావాల్సిన పదార్థాలు:
శనగపప్పుు- 1కప్పు
బియ్యంపిండి- పావు కప్పు
పచ్చికొబ్బరి తురుము - పావు కప్పు
బెల్లం తురుము - 1 కప్పు
యాలకుల పొడి - 1చెంచా
నూనె- వేయించడానికి కావాల్సినంత

తయారీ విధానం:
శనగపప్పు ఉడకబెట్టి ముద్దలుగా చేసుకోవాలి. అందులో బియ్యంపిండి, పచ్చికొబ్బరి తురుము వేసి కలుపుకోవాలి. మందంగా చపాతి పిండిలా వత్తుకుని అర్థచంద్రాకారంలో కట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని వేడినూనెలో వేసి వేయించుకోవాలి. ఇప్పుడు బెల్లం తురుమును మునిగేదాక నీళ్లు పోసుకుని తీగపాకం చేసుకోవాలి. అందులో యాలకుల పొడి వేసి ముందుగా వేయించుకున్న నెలవంకలను అందులో వేయాలి. 20 నిమిషాల తర్వాత గిన్నెలోకి తీసుకుంటే నెలవంకలు రెడీ.

సున్నండలు:
కావాల్సిన పదార్థాలు:
మినపప్పు- పావుకిలో
బెల్లం తురుము - పావు కిలో
నెయ్యి - 4 టేబుల్ స్పూన్స్
యాలకుల పొడి - అర టీస్పూన్

తయారీ విధానం:
స్టౌ వెలిగించి ఒకపాన్ పెట్టుకుని అందులో మినపపప్పు వేసి 5 నిమిషాలు వేయించాలి. ఇవి వేగిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకుని అదే పాన్ లో నెయ్యి వేసి మరిగించాలి. తర్వాత మినుమలను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బెల్లం తురుమును ఒకసారి మిక్సీ జార్లో వేసుకుని తిప్పాలి. మినపపిండి, బెల్లం, యాలకుల పొడి అన్నీ ఒక గిన్నెలో వేసుకుని బాగా కలపుకోవాలి. కొంచెం నెయ్యి వేస్తూ చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటే ఘుమఘుమలాడే సున్నుండలు సిద్ధం.

ఇది కూడా చదవండి: అటల్ సేతును ప్రారంభించిన పీఎం మోదీ..వంతెన అందాలు చూస్తే ఫిదావ్వాల్సిందే..!!

#food-items #sankranti-2024 #makar-sankranti-2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe