/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Trade-talk.-another-disaster-weekend-jpg.webp)
ఈవారం ఊహించని రిజల్ట్ ఏదైనా ఉందంటే అది బెదురులంక మాత్రమే. కార్తికేయ హీరోగా నటించిన ఈ సినిమాకు ఓ మోస్తరు పాజిటివ్ టాక్ వచ్చింది. తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఓ సెక్షన్ ఆడియన్స్‌కు బాగానే నచ్చింది. కాకపోతే లాంగ్ రన్‌లో ఇది ఏ మేరకు నిలబడుతుందనేది అనుమానాస్పదం. ఎందుకంటే, ఈ సినిమాకు అన్ని ఏరియాస్ నుంచి ఒకేలా లేదు టాక్. కార్తికేయ, నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు క్లాక్స్ దర్శకత్వం వహించాడు. మణిశర్మ సంగీతం అందించాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Trade-talk.-another-disaster-weekend-1-jpg.webp)
అతిపెద్ద డిసప్పాయింట్‌మెంట్ ఏదైనా ఉందంటే అది గాండీవధారి అర్జున మాత్రమే. వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ కోణంలోనూ తృప్తిపరచలేకపోయింది. దీంతో వరుణ్ తేజ్ కెరీర్‌లో మరో డిజాస్టర్ తప్పలేదు. ఇది ఏ స్థాయిలో ఫ్లాప్ అయిందంటే.. ఈ సినిమా పెట్టిన క్యూబ్ ఖర్చులు కూడా వెనక్కు వచ్చేలా లేవు. బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాకు నిర్మాత.
ఇక గత వారం వచ్చిన మరో విలక్షణ చిత్రం కింగ్ ఆఫ్ కొత్త. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమా కచ్చితంగా కొత్తగా ఉంటుందని తెలుగు ప్రేక్షకులు ఆశించారు. కానీ టైటిల్‌లో ఉన్న 'కొత్త'దనం సినిమాలో కనిపించలేదు. దీనికితోడు భారీ రన్ టైమ్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించింది. ఫలితంగా రిలీజైన మొదటి రోజే ఈ సినిమా ఫ్లాప్ అయింది. విలక్షణ నటుడిగా పేరున్న దుల్కర్, మాస్ అప్పీల్ కోసం చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Trade-talk.-another-disaster-weekend-2-jpg.webp)
ఇక బాయ్ హాస్టల్ ది మరో ప్రహసనం. కంటెంట్ పరంగా కన్నడ మేకర్స్ ఎప్పుడూ టాలీవుడ్ కంటే వెనక ఉంటారనే విషయాన్ని ఈ సినిమా మరోసారి రుజువుచేసింది. అప్పుడప్పుడు కేజీఎఫ్, కాంతార లాంటి సినిమాలొచ్చినప్పటికీ.. 99శాతం కన్నడ కంటెంట్, టాలీవుడ్‌లో ఆల్రెడీ టచ్ చేసిన సబ్జెక్టులే ఉంటున్నాయి. బాయ్స్ హాస్టల్ కూడా అలాంటిదే. ఇందులో వచ్చిన సన్నివేశాలన్నింటినీ మనం పదేళ్ల కిందట ఏదో ఒక సినిమాలో చూసినవే.
ఇలా బెదురులంక మినహా వచ్చిన సినిమాలన్నీ వేటికవే ఫ్లాప్ అవ్వడంతో..ఈవారం మరోసారి జైలర్‌కు స్కోప్ దక్కింది. వరుసగా మూడో వారం రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా 560 కోట్ల రూపాయల గ్రాస్ సాధించిన ఈ మూవీ, తెలుగు రాష్ట్రాల్లో 75 కోట్ల రూపాయలకుపైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.
Follow Us