Revanth Reddy: మోదీ చెప్పిన విషయాన్ని మేం ఎప్పుడో చెప్పాం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న రేవంత్

తెలంగాణలో బీజేపీ-బీఆర్ఎస్ మధ్య ఉన్నది ఫెవికాల్ బంధమన్న విషయం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్ సాక్షిగా మరోసారి స్పష్టం చేశారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. వారిద్దరు చీకటి మిత్రులు, ఢిల్లీలో దోస్తీ – గల్లీలో కుస్తీ అని తాము మొదటి నుండి చెబుతున్నదే నిజం అని మోదీ మాటల ద్వారా సుస్పష్టంగా తేలిందన్నారు.

Telangana: భద్రత ఇస్తారా? కోర్టుకెళ్లాలా?.. తెలంగాణ డీజీపీకి రేవంత్ వార్నింగ్!
New Update

ప్రధాని మోదీ (PM Modi) ఈ రోజు తెలంగాణ పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ పై (CM KCR) సంచలన వాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో మోదీ చేసిన వాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా ఈ వాఖ్యలపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) స్పందించారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో బీజేపీ-బీఆర్ఎస్ మధ్య ఉన్నది ఫెవికాల్ బంధమన్న విషయం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్ సాక్షిగా మరోసారి స్పష్టం చేశారని అన్నారు. వారిద్దరు చీకటి మిత్రులు, ఢిల్లీలో దోస్తీ – గల్లీలో కుస్తీ అని తాము మొదటి నుండి చెబుతున్నదే నిజం అని మోదీ మాటల ద్వారా సుస్పష్టంగా తేలిందన్నారు. 'కేసీఆర్ ఎన్డీయేలో చేరాలనుకున్నది నిజం... మోదీ ఆశీస్సులతో కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలనుకున్నది నిజం.. ఇప్పటికీ మోడీ – కేసీఆర్ చీకటి మిత్రులే అన్నది పచ్చి నిజం.' అని అన్నారు రేవంత్ రెడ్డి.
ఇది కూడా చదవండి: PM Modi vs CM KCR: ఎన్డీఏలోకి వస్తానంటే వద్దన్నా.. కేటీఆర్ ను ఆశీర్వదించమంటే నో చెప్పా.. కేసీఆర్ టాప్ సీక్రెట్స్ రివీల్ చేసిన మోదీ

నిజం నిప్పులాంటిది.. ఎప్పటికైనా నిగ్గుతేలక మానదని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని... బీజేపీ – బీఆర్ఎస్ ఫెవికాల్ బంధాన్ని అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. గడచిన 9 ఏళ్లలో మోడీ తీసుకున్న ప్రతీ నిర్ణయంలో కేసీఆర్ మద్దతు ఉన్నదన్న విషయం పార్లమెంట్ రికార్డులే చెబుతాయని రేవంత్ గుర్తు చేశారు.

కేసీఆర్ ఢిల్లీ వెళ్లీ చీకట్లో మోడీతో ఏయేం లాలూచీలు పడ్డాడో మోడీనే చెప్పిన తర్వాత ఇక వారిద్దరి అనుబంధం బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని.. వారి అనుబంధాన్ని సందేహించాల్సిన అవసరం అంతకంటే లేదని రేవంత్ తనదైన శైలిలో వాఖ్యానించారు. తెలంగాణ సమాజం అప్రమత్తతో ఉండి.. ఆ రెండు పార్టీల చీకటి సంబంధాన్ని గుర్తెరిగి వచ్చే ఎన్నికల్లో నిర్ణయం తీసుకోవాలని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా కోరారు.

#revanth-reddy #cm-kcr
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe