CM Revanth Reddy: రేపు సీఎం రేవంత్ అధ్యక్షతన తెలంగాణ కాంగ్రెస్ కీలక సమావేశం.. ఆ అంశాలపై చర్చ?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎంపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించనున్నారు.

New Update
TS: ఉద్యోగుల వయో పరిమితి ఇష్యూ.. వార్తలపై క్లారిటీ ఇచ్చిన అధికారులు.. ఏమన్నారంటే!

జనవరి 3న మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఇంచార్జ్ ఆర్గనైజేషన్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. టీపీసీసీ చీఫ్‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన ఈ మీటింగ్ జరగనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జ్ గా నూతనంగా నియమితులైన శ్రీమతి దీపా దాస్ మున్షి, ఏఐసీసీ ఇంచార్జ్ కార్యదర్శులు, పీఏసీ సభ్యులు, పీఈసీ సభ్యులు, మంత్రులు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు, చైర్మన్ లు అధికార ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.
ఇది కూడా చదవండి: RSPraveen: ‘సలహా మండలి’లో చేరను.. సీఎం రేవంత్ కు RS ప్రవీణ్ షాక్

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక జరుగుతున్న మొదటి కార్యవర్గ సమావేశం కావడంతో రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ సమావేశాల్లో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇంకా నామినేటెడ్ పోస్టుల భర్తీపై సైతం చర్చించనున్నట్లు గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి.

Advertisment
తాజా కథనాలు