Heavy Rains In Mumbai : ముంబైను ముంచెత్తిన వర్షాలు

ముంబైలో కుండపోత వాన కురుస్తుంది. సుమారు 6 గంటల నుంచి వర్షం ఆగకుండా పడుతుంది. ఠానేలోని రిసార్ట్​లో చిక్కుకుపోయిన 49 మందిని ఎన్డీఆర్ఎఫ్ టీమ్ కాపాడింది. పట్టాలపైకి నీరు చేరడంతో పాటు చెట్లు పడటంతో ఠానే జిల్లాలోని కసారా, టిట్వాలా మధ్య లోకల్ ట్రైన్స్​ను అధికారులు ఆపేశారు.

New Update
Heavy Rains In Mumbai : ముంబైను ముంచెత్తిన వర్షాలు

Mumbai : దేశ వ్యాప్తంగా వానలు బాగా కురుస్తున్నాయి. ఉత్తర భారత దేశాన్ని (North India) వర్షాలు (Rains) వణికిస్తున్నాయి. అస్సాం, ఉత్తరాఖండ్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, బిహార్‌ తో పాటు పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు రాష్ట్రాలకు ఐఎండీ (IMD) అధికారులు రెడ్‌ అలర్డ్‌ జారీ చేశారు. ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. వరదలు పోటెత్తడంతో జనజీవనం ఎక్కడికక్కడ నిలిచిపోయింది.

మహారాష్ట్రలోని ముంబైలో కుండపోత వాన కురుస్తుంది. సుమారు 6 గంటల నుంచి వర్షం ఆగకుండా పడుతుంది. ఠానేలోని రిసార్ట్​లో చిక్కుకుపోయిన 49 మందిని ఎన్డీఆర్ఎఫ్ టీమ్ (NDRF Team) కాపాడింది. పట్టాలపైకి నీరు చేరడంతో పాటు చెట్లు పడటంతో ఠానే జిల్లాలోని కసారా, టిట్వాలా మధ్య లోకల్ ట్రైన్స్​ను అధికారులు ఆపేశారు. బిహార్​లోని నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. కోసి, మహానంద, గండక్, కమ్లా బాలన్ నదీ పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లను అధికారులు ఇప్పటి కే ఖాళీ చేయించారు. భాగామతి నది ఉప్పొంగడంతో ముజఫర్​నగర్, అరుయి, సుప్పి ప్రాంతాలు నీట మునిగాయి.

Also read: టీటీడీ నుంచే ప్రక్షాళన : సీఎం చంద్రబాబు

Advertisment
తాజా కథనాలు