ఇండియాలో టాప్-5 ఓటీటీలు ఇవే..! By Bhavana 26 Jul 2023 in Uncategorized New Update షేర్ చేయండి ప్రస్తుతం భారత్ లో ఓటీటీ సంస్థల మధ్య పోటీ దారుణంగా ఉంది. సబ్ స్క్రైబర్లను పెంచుకునేందుకు, ఓటీటీ కంపెనీలన్నీ ప్రతి వారం పోటీపడి కంటెంట్ ను పోస్ట్ చేస్తున్నాయి. స్ట్రయిట్ సినిమాలతో సమానంగా ప్రచారం చేస్తున్నాయి. అసలు ఈ ఓటీటీలకు ఇండియాలో ఉన్న చందాదారులు ఎంతమంది? ఈ విషయంలో ఏ ఓటీటీ కంపెనీ ఏ స్థానంలో ఉంది? ఈ ఏడాది జూన్ నాటికి అత్యథిక చందాదారులు కలిగిన సంస్థగా డిస్నీ హాట్ స్టార్ నిలిచింది. ఈ ఓటీటీకి 4.9 కోట్ల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. వీళ్లకు ఇంతమంది చందాదారులు ఉండడానికి కారణం క్రికెట్. ఇక రెండో స్థానంలో అమెజాన్ ప్రైమ్ వీడియోస్ నిలిచింది. ఈ ఓటీటీకి దేశంలో 2.1 కోట్ల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. నిజానికి ప్రతివారం యాక్టివ్ గా ఉండే ఓటీటీ ఇది. లెక్కలేనన్ని సినిమాలు, ఒరిజినల్ కంటెంట్ పెడుతుంటుంది. కానీ క్రీడాభిమానులు మాత్రం అమెజాన్ వైపు రావడం లేదు. మూడో స్థానంలో జియో సినిమా నిలిచింది. కోటీ 20 లక్షల మంది సబ్ స్క్రైబర్లు దీనికి ఉన్నారు. నిజానికి ఐపీఎల్ కు ముందు ఈ యాప్, టాప్-5లో కూడా లేదు. ఎప్పుడైతే ఐపీఎల్ స్ట్రీమింగ్ పెట్టి, ఆ తర్వాత హాలీవుడ్ కంటెంట్ ను ఉచితంగా ఇవ్వడం స్టార్ట్ చేసిందో, అమాంతం మూడో స్థానానికి ఎగబాకింది. ఇక నాలుగో స్థానంలో సోనీ లివ్ (1.1 కోట్లు), ఐదో స్థానంలో జీ5 (75 లక్షలు) నిలిచాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. టాప్-5లో నెట్ ఫ్లిక్స్ కు చోటు దక్కకపోవడం. కేవలం 55 లక్షల మంది సబ్ స్క్రైబర్లతో ఈ యాప్ నడుస్తోంది. ఇక ఆహా పరిస్థితి చెప్పనక్కర్లేదు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి