కొన్ని టూత్ పేస్టుల్లో క్యాన్సర్ కారకాలు!

టూత్ పేస్టుల్లు వాడుతున్నారా అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇటీవల టూత్ పేస్టులు కూడా నోటి క్యాన్సర్ కు కారణం అన్న విషయాన్ని అధ్యయనాలు వెల్లడించాయి.

New Update
కొన్ని టూత్ పేస్టుల్లో క్యాన్సర్ కారకాలు!

టూత్ పేస్టులు కూడా నోటి క్యాన్సర్ కు కారణం అన్న విషయాన్ని ఇటీవల అధ్యయనాలు వెల్లడించాయి. టూత్ పేస్టులతో క్యాన్సర్ ప్రమాదం మనం ఉపయోగించే టూత్ పేస్టులలో బ్రష్ చేసేటప్పుడు నురగ రావడానికి, సులభంగా బ్రష్ కదలడానికి వీలుగా సోడియం లారిల్ సల్ఫేట్ అనే రసాయనాన్ని కలుపుతారు. ఈ రసాయనం మన చర్మంపై దురదలకు, నోటిపూతకు కారణమవుతుంది. హార్మోన్లను కూడా డిస్టర్బ్ చేస్తుంది. ఇక మరికొన్ని టూత్ పేస్ట్ లలో డైతనోలమైన్ అనే రసాయనం ఉంటుంది. ఈ రసాయనం హార్మోన్ల అసమతుల్యతకు, కిడ్నీ, లివర్ వ్యాధులకు, ఊబకాయానికి, క్యాన్సర్ కు కారణం అవుతుంది.

ఇక టూత్ పేస్ట్ ను నురుగు వచ్చేలా చేయడానికి డి ఈ ఏ అనే రసాయనాన్ని వాడుతారు. ఇది కూడా మన ఆరోగ్యానికి ప్రమాదకరమైనదని చెబుతున్నారు. అయితే శాస్త్రవేత్తల అధ్యయనంలో డైతనోలమైన్ అనే రసాయనం క్యాన్సర్ కారకంగా గుర్తించారు. అందుకే టూత్ పేస్టులను కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. టూత్ పేస్టులపై రంగుల కొలతలు టూత్ పేస్ట్ ల పైన ఎరుపు,ఆకుపచ్చ, నలుపు, నీలం రంగు కొలతలను ఇస్తారు. కొలతలను అర్థం చేసుకొని టూత్ పేస్ట్ లను కొనుగోలు చేయాలి.

ఇక వీటి అర్థం చూస్తే ఎరుపురంగు టూత్ పేస్టులు రసాయనికంగా కొద్దిగా మిళితమైన టూత్ పేస్టులు, ఆకుపచ్చరంగు కొలత టూత్ పేస్టులు సహజసిద్ధమైన టూత్ పేస్టులు, ఇక బ్లూమార్క్ ఉన్న టూత్ పేస్టులు కొంత సహజసిద్ధమైన కొంత, రసాయనాలు మిళితమైన టూత్ పేస్టులు అని చెప్తున్నారు. బ్లాక్ మార్క్ ఉన్న టూత్ పేస్టులు డేంజర్ .. క్యాన్సర్ ప్రమాదం బ్లాక్ మార్క్ కొలత ఉన్న టూత్ పేస్టులు పూర్తిగా రసాయనాలతో తయారైన టూత్ పేస్టులు. కాబట్టి సహజసిద్ధమైన టూత్ పేస్ట్ లు కొనుగోలు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. రసాయనాలతో కూడిన టూత్ పేస్ట్ లతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది వాటిని కొనుగోలు చేయకుండా ఉంటేనే మంచిది. ప్రతి ఒక్కరు టూత్ పేస్ట్ ల విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు