CBN : తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం!

మీకు తెల్ల రేషన్‌ కార్డు ఉందా..అయితే ఈ శుభవార్త మీకోసమే... ఏపీ ప్రభుత్వం జులై నెల నుంచి రేషన్‌ కార్డు దారులకు బియ్యంతో పాటు పంచదార, కందిపప్పును కూడా అందించనున్నట్లు సమాచారం..

New Update
Ap Cabinet : నేడు తొలిసారి సమావేశం కానున్న ఏపీ కేబినేట్!

Chandrababu Naidu : మీకు తెల్ల రేషన్‌ కార్డు (White Ration Card) ఉందా.. అయితే ఈ శుభవార్త మీకోసమే... ఏపీ ప్రభుత్వం (AP Government) జులై నెల నుంచి రేషన్‌ కార్డు దారులకు బియ్యంతో పాటు పంచదార, కందిపప్పును కూడా అందించనున్నట్లు సమాచారం. గత కొన్నిరోజులుగా ఏపీలో రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు పంపిణీ ఆగిపోయింది. ఈ నేపథ్యంలో రేషన్ కార్డుదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అయితే కొత్తగా వచ్చిన టీడీపీ కూటమి (TDP Alliance) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిపై దృష్టి సారించింది. రేషన్ షాపుల ద్వారా కందిపప్పు పంపిణీ జరగడం లేదనే వార్త ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి రాగా.. ఆయన వెంటనే ఈ విషయం గురించి ఆరా తీశారు. కందిపప్పు పంపిణీ వచ్చే నెల నుంచి ప్రారంభించాలని ఆదేశించినట్లు సమాచారం.

ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) ఆదేశాలతో ఏపీ పౌరసరఫరాలశాఖ అధికారులు కూడా ఈ విషయం గురించి చర్యలు చేపట్టారు. పంపిణీ కోసం కందిపప్పును కొనుగోలు చేసి ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు ఇప్పటికే తరలించారు. సాధారణంగా జూన్ 20 వ తేదీ వరకూ రేషన్ షాపులకు సరుకులు చేరుకుంటాయి. ఈ నేపథ్యంలో ఒకట్రెండు రోజుల్లో కందిపప్పు, చక్కెర కూడా మిగతా సరుకులతో పాటుగా రేషన్ దుకాణాలకు చేరుకోనుంది. రేషన్ షాపుల్లో కందిపప్పు దొరకకపోవటంతో ఇన్నిరోజులు మధ్యతరగతి వారు ఇబ్బందులు పడ్డారు. బహిరంగ మార్కెట్లో కందిపప్పు రేటు రోజురోజుకూ పెరిగిపోతున్న క్రమంలో.. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మధ్యతరగతి వరకు ఈ నిర్ణయం కొంచెం ఊరట కలిగిస్తుంది.

మరోవైపు నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ప్రజలకు అనుకూలంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం చంద్రబాబు రేషన్ సరుకుల విషయంలోనూ ఊరట నిచ్చే నిర్ణయం తీసుకున్నారని తెల్లరేషన్ కార్డుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జులై ఒకటి నుంచి పెరిగిన పింఛన్లు అమల్లోకి రానుండగా.. వాటికి జతగా తెల్లరేషన్ కార్డుదారులకు ఈ శుభవార్త వివరించింది ఏపీ ప్రభుత్వం.

Also read: తెలంగాణలో అప్పటి వరకు వర్షాలే..ఐఎండీ కీలక ప్రకటన!

Advertisment
తాజా కథనాలు