రైతును దారుణంగా హత్య చేసేలా చేసిన టమాటా ధరలు టమటా.. టమాటా.. నువ్వు ఏం చేస్తావు అంటే భార్యాభర్తల మధ్య చిచ్చుపెడతా.. హోటల్స్ నిర్వాహకులు, కస్టమర్ల మధ్య గొడలు సృష్టిస్తా.. దొంగలు పడకుండా బౌన్సర్లను పెట్టిస్తా.. నా పంట పండించి లాభాల బాట పట్టిన రైతులను హత్య చేసేలా ప్రేరేపిస్తా అంటుంది. ఎందుకుంటే ప్రస్తుతం టమాటా ధరలకు రెక్కలు రావడంతో సమాజంలో పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. పెరిగిన ధరలతో ఓ టమాటా రైతుకు భారీగా లాభాలొచ్చాయి. అదే ఇప్పుడు అతడి ప్రాణాలు తీసేలా చేసింది. By Vijaya Nimma 14 Jul 2023 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి రైతు పాలిట శాపంగా టమాటా పంట.. కొన్ని రోజులుగా టమాటా ధరలు కేజీ రూ.100 నుంచి 150 మధ్య పలుకుతున్నాయి. దీంతో టమాటా రైతులకు భారీ డిమాండ్ ఏర్పడింది. కొంతకాలంగా నష్టాలు చూసిన రైతులు ధరల పెరుగుదలతో లాభాల బాట పడుతున్నారు. కానీ ఈ లాభాలే ఓ టమాటా రైతు పాలిట శాపంగా మారాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం బోడిమలదిన్నెకు చెందిన రాజశేఖర్ రెడ్డి అనే రైతు ఊరికి దూరంగా తన నాలుగు ఎకరాల్లో టమాటా సాగుతో పాడి వ్యాపారం కూడా చేస్తున్నారు. అయితే ఇటీవల ఐదు కోతల పంటను అమ్మగా భారీ లాభాలొచ్చాయి. తాజాగా కూడా మార్కెట్లో పంట విక్రయించగా మంచి ఆదాయం వచ్చింది. కాపు కాసి.. హత్య చేసి.. టమాటా పంటలో భారీగా డబ్బులు సంపాందించారని తెలుసుకున్న కొంతమంది దుండగులు ఆయన హత్యకు పథకం వేశారు. పొలానికి వెళ్లి రాజశేఖర్‌రెడ్డి గురించి ఆయన భార్యను వివరాలు అడగ్గా.. మదనపల్లె డిపోలో పాలు పోయడానికి వెళ్లాడని చెప్పారు. దీంతో వారు దారి మధ్యలో కాపు కాశారు. ఇంతలో ఆయన బైక్‌పై రావడంతో బైకును ఆపి చేతులు కాళ్లు కట్టేసి, మెడకు టవల్ చుట్టి హతమార్చారు. అనంతరం అతని దగ్గర ఉన్న డబ్బులను తీసుకుని పరారైయ్యారు. డబ్బుల కోసమే మర్డర్.. రాజశేఖర్‌రెడ్డి ఎంతసేపు అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించారు. తమ పొలానికి సమీపంలోనే ఆయన మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. టమాటాలు విక్రయించగా వచ్చిన డబ్బుల కోసమే హత్య జరిగినట్లు కుటుంబ సభ్యులు, పోలీసులు అనుమానిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని.. నిందితులను త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి