Actor : టాలీవుడ్ యంగ్ హీరో బిగ్ స్టేట్ మెంట్ వైరల్! ఆ పని చేయకూడదని డిసైడయిన యంగ్ హీరో! By Durga Rao 23 Apr 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Tollywood Young Hero : సినిమా(Cinema) ల్లో అతి పిన్న వయసులోనే స్టార్ ఇమేజ్(Star Image) సొంతం చేసుకున్న హీరోలు చాలా మంది ఉన్నారు. అయితే వీళ్లకు ముందుగానే స్టార్ డమ్ రావడం వల్లో లేక ఇప్పుడు స్టార్ రేంజ్ నుంచి కాస్త పడిపోయామనే ఫీలింగ్ వల్లనో కాని పెళ్లి పేరు చెబితే చాలు అమ్మో మాకా పెళ్లా అంటున్నారు. ఈ లిస్టులో చేరిపోయాడు మరో యంగ్ హీరో. ఒక చిన్న సినిమాతో పెద్ద హీరోగా మారిన నటుడు ఇప్పుడు పెళ్లి పేరు చెబితేనే భయపడిపోతున్నాడు. నిజంగా లైఫ్ లో పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయ్యానంటూ స్టేట్ మెంట్ కూడా ఇచ్చాడు. జాయింట్ లైఫ్ కంటే సోలో బ్రతుకే సో బెటర్(Solo Life Is So Better) అంటున్నాడు ఈ యంగ్ అండ్ స్మార్ట్ హీరో. అక్కినేని నాగార్జున నిర్మాతగా.. ఉయ్యాల జంపాల సినిమాతో హిరోగా పరిచయమైన రాజ్ తరుణ్(Raj Tarun) ఇప్పుడు లైఫ్ టైం బ్యాచిలర్ గా ఉండిపోవడానికి ఫిక్సయ్యాడు. ఇదే విషయాన్ని ఓ సోషల్ మీడియా వేదిక ద్వారా అందరితో షేర్ చేసుకున్నాడు.ఫస్ట్ మూవీతో హీరోగా హిట్ కొట్టిన రాజ్ తరుణ్ ..ఆ తర్వాత ఇండస్ట్రీలో వరుస ఛాన్సులతో బిజీ హీరోగా మారిపోయాడు. అయితే ఈ యంగ్ స్టార్ క్రేజ్ పేక మేడలా కూలిపోయింది. ఎంత త్వరగా ఎదిగాడో అంతే త్వరగా హీరో నుంచి సైడ్ హీరో స్థాయికి పడిపోయాడు. రీసెంట్ గా నాగార్జున హీరోగా చేసిన నా సామిరంగ సినిమాలో చిన్న పాత్రతో సరిపెట్టుకున్నాడు రాజ్ తరుణ్. ఆమధ్యలో ఈ యంగ్ హీరో రాజ్ తరుణ్ పెళ్లి(Marriage) చేసుకుంటున్నాడనే వార్తలతో పాటు ప్రేమలో పడ్డాడనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే దీనిపై హీరో రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తనకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే లేదంటూ కుండబద్దలు కొట్టాడు. లైఫ్ లో పెళ్లి చేసుకోవద్దని డిసైడ్ అయ్యాయని తేల్చి చెప్పాడు. సింగిల్ లైఫ్ చాలా హ్యాపీగా ఉందంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం సింగిల్ గా తాను చాలా హ్యాపీగా ఉంటానని చెప్పిన హీరో పెళ్లి విషయంలో మొదట్నుంచి తన ఫ్యామిలీ తన ఇష్టానికి వదిలేశారని చెప్పాడు. అమ్మ మాత్రమే పెళ్లి చేసుకోమని అంటూ ఉండేదని అన్నాడు. Also Read : పుష్ప-2 నుంచి పిచ్చెక్కించే అప్డేట్.. రేపే ఆ ప్రోమో ! రీసెంట్ గా మూడు పదుల పయసు దాటిన రాజ్ తరుణ్ … ఇంకా పెళ్లికి టైముంది కాబట్టే ఈవిధంగా దాటవేస్తున్నాడా లేక నిజంగానే పెళ్లి , పిల్లలు వద్దనుకొని హీరో తరుణ్ లాగానే ఉండిపోతాడో చూడాలి. రాజ్ తరుణ్ కూడా తరుణ్ లాగానే హిట్ హీరోగా పేరు తెచ్చుకొని తర్వాత వెబ్ సిరీస్ లకు పరిమితం అయ్యాడు.ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోని చాలా మంది హీరోలు ఇంకా బ్యాచిలర్స్ గానే ఉన్నారు. అయితే ప్రభాస్ నుంచి తరుణ్ , అడివిశేషు వంటి యంగ్ హీరోలంతా పెళ్లికి దూరంగా సోలో బ్రతుకే సో బెటర్ అని సరిపెట్టుకుంటున్నారు. #tollywood #raj-tarun #no-to-marry మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి