Tamanna: మిల్కీ బ్యూటీ తమన్నా గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 18 ఏళ్ళైనా ఈ అమ్మడు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. రీసెంట్ గా బోళాశంకర్ సినిమాలో చిరంజీవీ సరసన, జైలర్ మూవీలో రజినీకాంత్ సరసన స్టెప్పులేసి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది ఈ ముద్దు గుమ్మ.
Also Read: Surekha Vani: ఆయనను మళ్ళీ చూడాలి.. భర్తను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయిన సురేఖ వాణి
రస్నా బ్రాండ్ అంబాసిడర్ గా తమన్నా
ఇది ఇలా ఉంటే తాజాగా తమన్నా .. ఓ చారిత్రాత్మక బ్రాండ్ కు బ్రాండ్ అంబాసడర్ గా ఎంపికైంది. చారిత్రక పానీయాల బ్రాండ్ రస్నా ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది. త్వరలో ఈ బ్రాండ్ మార్కెట్ లో విడుదల కానుంది. ఇప్పటికే బ్రాండ్ ప్రమోషన్స్ కు సంబంధించిన పలు యాడ్ షూట్స్ లో పాల్గొన్నారు తమన్నా.
Also Read: Mamitha Baiju: నయా క్రష్.. రాజమౌళినే పడేసిందిగా.. ఎవరీ మమిత బైజూ?