Salaar 2: ప్రభాస్ సలార్ 2.. రిస్క్ తీసుకోవాల్సిందేనా..?

ప్రభాస్ రీసెంట్ భారీ బడ్జెట్ ఫిల్మ్ సలార్. వెయ్యి కోట్ల సినిమాగా అంచనా వేసిన సలార్ ప్రపంచవ్యాప్తంగా 700+కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. దీంతో భారీ ఖర్చు పెట్టి సలార్ 2 చేయడం రిస్క్ అవుతుందేమో అనే ఆలోచనలో నిర్మాత విజయ్ కిరంగదూర్ ఉన్నారని సినీ వర్గాల్లో టాక్.

New Update
Salaar 2: ప్రభాస్ సలార్ 2.. రిస్క్ తీసుకోవాల్సిందేనా..?

Salaar 2: టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం జీనియస్ డైరెక్టర్ నాగశ్విన్ దర్శకత్వంలో రాబోతున్న కల్కీ 2898 AD చిత్రీకరణలో పాల్గొంటున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన కల్కీ పోస్టర్, టీజర్ విపరీతమైన హైప్ క్రియేట్ చేయగా .. ఇటీవలే రిలీజ్ డేట్ ప్రకటించి మరింత ఆసక్తిని పెంచేశారు మేకర్స్. జూన్ 27న విడుదల కానున్నట్లు తెలిపారు.

Also Read: Vijay Antony : విజయ్ ఆంటోనీ రోమియో ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

ఇది ఇలా ఉంటే.. కల్కి తర్వాత ప్రభాస్ ఖాతాలో షూటింగ్ కోసం సిద్ధంగా ఉన్న సినిమాల్లో సలార్ 2 ఒకటి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

కొనసాగని సలార్ క్రేజ్

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన రీసెంట్ భారీ బడ్జెట్ ఫిల్మ్ సలార్. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మక సంస్థ హోంబలే ఫిలిమ్స్ నిర్మించింది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సినిమాల్లో సలార్ ది బెస్ట్ మూవీ అనే అభిప్రాయం వ్యక్తం అయినప్పటికీ.. పూర్తి స్థాయిలో ప్రభాస్ ఫ్యాన్స్ కు క్లిక్కవ్వలేదు అనే టాక్ కూడా వచ్చింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సలార్.. ఆ క్రేజ్ ఎక్కువ రోజుల పాటు కొనసాగించలేకపోయింది. చాలా తక్కువ గ్యాప్ లోనే ఓటీటీలోకి కూడా వచ్చేయడం విశేషం.

మేకర్స్ వెయ్యి కోట్ల సినిమాగా అంచనా వేసిన సలార్ ప్రపంచవ్యాప్తంగా 700+కోట్లకు పైగా కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. అదే సమయంలో షారుక్ ఖాన్ డంకీ రిలీజ్ కూడా సలార్ కలెక్షన్స్ పై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఇక సలార్ కేవలం నైజం, ఓవర్సీస్ మార్కెట్ లో మాత్రమే బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ అందుకుంది. మిగిలిన చోట్ల ఎక్కడా కూడా బ్రేక్ ఈవెన్ రీచ్ అవ్వలేకపోయినట్లు సమాచారం.

publive-image

సలార్ 2 రిస్క్

అయితే ఇప్పుడు సలార్ పార్ట్ 1 ప్రభావం.. పార్ట్ 2 పై కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. పార్ట్ 1 కలెక్షన్స్, మూవీ క్రేజ్ ఊహించిన స్థాయిలో లేకపోవడంతో  పార్ట్ 2 బడ్జెట్ విషయంలో దర్శక, నిర్మాతల మధ్య చర్చలు జరుగుతున్నట్లు సినీ వర్గాల్లో టాక్. పార్ట్ 1 కంటే సలార్ పార్ట్ 2 కోసం ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సి ఉంటుందంట. పార్ట్ 2 పై అభిమానులలో కూడా పెద్దగా హడావిడి ఏం కనిపించడం లేదు. దీంతో నిర్మాతలు కాస్త వెనక్కి తగ్గుతున్నట్లుగా తెలుస్తోంది. భారీ ఖర్చు పెట్టి సలార్ 2 చేయడం రిస్క్ అవుతుందేమో అనే ఆలోచనలో ఉన్నారట నిర్మాత విజయ్ కిరంగదూర్. ఇక ఈ చర్చల కారణంగానే సలార్ 2 చిత్రీకరణ ఆలస్యం అవుతున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Also Read: Urfi Javed : ఉర్ఫీ మ్యాజికల్ గౌన్ పై నటి సమంత పోస్ట్.. వైరలవుతున్న వీడియో..!

Advertisment
తాజా కథనాలు