Chinmayi Fired on Senior Actor Annapurnamma: టాలీవుడ్ సింగర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సింగర్ గా ఎంతో మందిని ఆకట్టుకున్న ఈమె.. సోషల్ మీడియాలో కూడా సూపర్ యాక్టీవ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా.. సామాజిక అంశాల పై ఈమె చేసే కామెంట్స్ తెగ వైరలవుతుంటాయి. ముఖ్యంగా ఆడవారికి సంబంధించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే.. వెంటనే స్ట్రాంగ్ కౌంటర్స్ ఇచ్చేస్తుంటారు.
అయితే తాజాగా సీనియర్ నటి అన్నపూర్ణమ్మ పై చిన్మయి (Chinmayi Sripaada) చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి. అన్నపూర్ణమ్మ చేసిన కామెంట్స్ పై సెటైరికల్ గా స్పందిస్తూ వీడియోను రిలీజ్ చేశారు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాము..
This Week Theatre Releases: ఈ వారం థియేటర్ లో అదిరిపోయే చిత్రాలు.. అందులో స్టార్ కమెడియన్ సినిమా కూడా..
మహిళల పై అన్నపూర్ణమ్మ కామెంట్స్
ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న అన్నపూర్ణమ్మ మహిళల స్వాతంత్య్రం గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. 'ఆరోజుల్లో.. అర్థరాత్రి స్వతంత్య్రం అనగానే ఆడవారు బయటకు వచ్చేవాళ్లా? ఆడదానికి స్వాతంత్య్రం ఎందుకు కావాలి..? 12 గంటల తర్వాత బయట ఏం పని.. ఇప్పుడు ఎక్స్‌పోజింగ్ ఎక్కువైపోయింది. మనల్ని ఎవరూ ఏమీ అనకూడదని అనుకున్నా.. అనేట్లుగా మనం రెడీ అవుతున్నాము. ఎప్పుడూ ఎదుటి వారిదే తప్పు కాదు.. మనది కూడా ఉంటుంది' అంటూ మాట్లాడారు.
అన్నపూర్ణమ్మ కామెంట్స్ పై చిన్మయి కౌంటర్
ఆడవారి పై నటి అన్నపూర్ణమ్మ (Annapurnamma) చేసిన వ్యాఖ్యల పై చిన్మయి ఘాటుగా స్పందించింది. అన్నపూర్ణమ్మ రూల్స్ ప్రకారం.. 'అర్థరాత్రి లేడీ డాక్టర్స్ ఉండకూడదు. మహిళలు అర్థ రాత్రి ప్రసవించకూడదు. ఇప్పటికీ ఊర్లలో చాలా మంది మహిళలు బాత్ రూమ్ లేక బయటకు వెళ్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో కూడా ఆడవారు ఎప్పుడు వస్తారా..? వాళ్లపై అఘాయిత్యానికి పాల్పడుదామా..? అని ఎదురుచూస్తున్నవాళ్లు ఉన్నారు. అమ్మాయిల డ్రెస్సింగ్ కారణంగానే అఘాయిత్యాలు జరుగుతున్నాయని అనుకునే ఇలాంటి బతుకుతున్న భారతదేశంలో ఆడపిల్లలుగా పుట్టడం మన కర్మ' అంటూ ఫైర్ అయ్యింది చిన్మయి. పూర్తి కామెంట్స్ కోసం ఈ కింది వీడియో చూడండి.
Also Read: Director Yashasvi: ‘నాలా ఇంకెవరూ మోసపోవద్దు’.. మ్యూజిక్ డైరెక్టర్ రధన్ పై వైరలవుతున్న యశస్వి కామెంట్స
Singer Chinmayi: మహిళలు అర్థరాత్రి ప్రసవించకూడదా? అన్నపూర్ణమ్మపై విరుచుకుపడ్డ చిన్మయి!
ఆడవారికి అర్థరాత్రి ఏం పని అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటి అన్నపూర్ణమ్మకు సింగర్ చిన్మయి కౌంటర్ ఇచ్చారు. అర్థరాత్రి లేడీ డాక్టర్స్ ఉండకూడదా? మహిళలు అర్థరాత్రి ప్రసవించకూడదా అని ఫైర్ అయ్యారు. ఆడపిల్లలుగా పుట్టడం మన కర్మ అని ఆవేదన వ్యక్తం చేశారు.