HBD Nagarjuna : మాస్ అయినా.. క్లాస్ అయినా.. ఇండస్ట్రీకి 'కింగ్' ఒక్కడే

అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. ఆ తర్వాత హీరోగా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు కింగ్ నాగార్జున. ఈరోజుతో (ఆగస్టు 29) ఆయన 65 వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా నాగ్ సినీ జర్నీ గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.

New Update
HBD Nagarjuna : మాస్ అయినా.. క్లాస్ అయినా.. ఇండస్ట్రీకి 'కింగ్' ఒక్కడే

Akkineni Nagarjuna Birthday Stroty : అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు.. ఆ తర్వాత నటుడిగా, నిర్మాతగా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు కింగ్ నాగార్జున. ఈరోజుతో (ఆగస్టు 29) ఆయన 65 వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా నాగ్ సినీ జర్నీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

నాగార్జున 1959 ఆగష్టు 29న చెన్నైలో జన్మించాడు. తండ్రి వారసత్వాన్ని తొలి చిత్రానికే పరిమితం చేసుకున్న ఈ హీరో 'విక్రమ్' సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఫస్ట్ మూవీతోనే హీరోగా సక్సెస్ అందుకున్నాడు దాసరి డైరెక్షన్ లో వచ్చిన ‘మజ్ను’ నాగార్జునకు మంచిపేరే తీసుకొచ్చింది. ప్రేమ కథాంశంతో తెరకెక్కిన మజ్న నాగ్ కెరీర్ కు బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత 'గీతాంజలి' తో నాగ్ కు యూత్ లో ముఖ్యంగా అమ్మాయిల్లో ఓ రేంజ్ లో క్రేజ్ వచ్చింది.

ఇక నాగార్జునను సెన్సెషనల్ హీరోగా టర్న్ చేసిన మూవీ శివ రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రం నాగ్ కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ లోనే సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. కేవలం యాక్షన్ మాత్రమే కాదు కామెడీ పండించడంలోనూ కింగ్ అనిపించుకున్నాడు. వారసుడు, అల్లరి అల్లడు, హలో బ్రదర్, మన్మథుడు, కింగ్ వంటి చిత్రాల్లో నాగార్జున తనదైన కామెడీ పంచ్ లతో అదరగొట్టారు. మన్మథుడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో మన్మథుడంటే నాగార్జున అనే విధంగా అమ్మాయిలందరిని తన మాయలో పడేసారు. ఇక 2008 లో వచ్చిన కింగ్ మూవీతో కింగ్ నాగార్జునగా మారారు.

Also Read : ‘పురుషోత్తముడు’ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఆ ఓటీటీలోనే

ఇప్పటికీ చెక్కచెదరని గ్లామర్ తో నేటి యంగ్ హీరోలకు సవాలు విసురుతున్నారు. ( కొత్తవారికి ఛాన్స్ ఇవ్వడంలో నాగార్జున ఎప్పడు ముందుంటారు. ప్రయోగాలు చేయడంలో ఏమాత్రం వెనకాడలేదు. ఇండస్ట్రీకి నాగ్ తన కెరీర్ లో రామ్ గోపాల్ వర్మ, వైవియస్.చౌదరి, రాఘవ లారెన్స్,ధశరథ్,కళ్యాణ్ కృష్ణ సాల్మన్‌.. సుమారు 40 మందికి పైగా దర్శకులను వెండితెరకు పరిచయం చేసారు. ఆయన చేసిన అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడీ సాయి వంటి చిత్రాలతో ఆడియన్స్ ను భక్తి పారవశ్యంలో ముంచెత్తారు.

ఒక మాస్ హీరో భక్తి చిత్రాలు చేయడం అనేది టాలీవుడ్ లో కేవలం నాగార్జునకు మాత్రమే దక్కింది. నటుడిగానే కాకుండా సక్సెస్ ఫుల్ నిర్మాతగానూ రాణించారు. తన తండ్రి ఏఎన్నార్ స్థాపించిన అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పై పలు సక్సెస్ ఫుల్ చిత్రాలను ప్రేక్షకులకు అందించాడు.

నాగ్ సినీ కెరీర్ లో మరిచిపోలేని సినిమా మనం. ఈ చిత్రంలో తండ్రి ఏఎన్నాఆర్‌తో పాటు కొడుకులు నాగ చైతన్య, అఖిల, కోడలు సమంతతో కలిసి నటించారు. తెలుగులో ఇండస్ట్రీలో మూడు తరాల హీరోలు కలిసి నటించిన ఏకైక చిత్రంగా మిగిలిపోయింది. ఈ మూవీతో తండ్రి కొడుకులతో కలిసి నటించిన ఏకైక హీరోగా నిలిచారు.

అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా సినీ పరిశ్రమలో అడుగు పెట్టి.. ఆ తర్వాత నటుడిగా, నిర్మాతగా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు కింగ్ నాగార్జున. ఈరోజుతో (ఆగస్టు 29) ఆయన 65 వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా నాగ్ సినీ జర్నీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisment
Advertisment
తాజా కథనాలు