Ram Charan: రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం .. ఆర్ట్ & కల్చర్ అంబాసిడర్ గా అవార్డు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌లో ఇండియన్ ఆర్ట్ & కల్చర్ అంబాసిడర్ గా అవార్డు అందుకోబోతున్నారు. ఈ అవార్డు పొందిన మొదటి భారతీయ సెలెబ్రెటీగా అరుదైన గౌరవం దక్కించుకున్నారు చరణ్.

Ram Charan: రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం ..  ఆర్ట్ & కల్చర్ అంబాసిడర్  గా అవార్డు
New Update

Ram Charan: ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. ఈ మూవీతో చరణ్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. మెగా పవర్ స్టార్ గా సినిమాల్లోకి అడుగుపెట్టిన చరణ్.. ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా ఎదిగారు.

publive-image

ఆర్ట్స్ అండ్ కల్చర్ అంబాసిడర్ గా అవార్డు

అయితే తాజాగా ఈ గ్లోబల్ స్టార్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ 15వ ఎడిషన్‌లో అతిథిగా పాల్గొనేందుకు ఆహ్వానం అందుకున్నారు. అంతే కాదు నటన రంగంలో విశేష కృషి కనబరిచిన చరణ్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ వేడుకలో ఇండియన్ ఆర్ట్ & కల్చర్ అంబాసిడర్ గా అవార్డు అందుకోబోతున్నారు. ఈ అవార్డు పొందిన మొదటి భారతీయ సెలెబ్రెటీగా అరుదైన గౌరవం దక్కించుకున్నారు చరణ్. విక్టోరియన్ ప్రభుత్వం ప్రతి యేటా ఈ ఫెస్టివల్ ఈవెంట్ నిర్వహిస్తుంది. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి 25 వరకు ఈ ఈవెంట్ జరగనుంది.

Also Read: MATKA: 'మట్కా'లో ఐటం సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ.. పోస్టర్ వైరల్..! - Rtvlive.com

#indian-film-festival-of-melbourne-2024 #ram-charan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe