వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ( RGV) తీసిన వ్యూహం( Vyuham) చిత్రం గురించి టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ (Natti Kumar) మరోసారి స్పందించారు. ఈ సినిమాని ఆపాలని నేను ఎవరినీ కోరలేదని ఆయన వివరించారు. ఈ సినిమా ద్వారా ఏపీ రాజకీయాలు మరింత రణరంగంగా మారే పరిస్థితులు ఉన్న కారణంగా ఎవరినీ కూడా విమర్శించొద్దని మాత్రమే నేను సెన్సార్ వారికి చెప్పానని ఆయన పేర్కొన్నారు.
అంతేకాకుండా సోనియా గాంధీ (Sonia Gandhi) , చంద్రబాబు నాయుడు (CBN) , పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వంటి నాయకులని వ్యంగ్యంగా చూపించకూడదని కోరినట్లు ఆయన వివరించారు. అయినా కూడా అలాంటి వాటిని పట్టించుకోకుండా సెన్సార్ పూర్తి చేశారని తెలిపారు. ఇదిలా ఉంటే జీవిత రాజశేఖర్ వైసీపీకి అనుకూలంగా ఉన్నారు కాబట్టి వారిని తప్పించమని సెన్సార్ వారిని కోరినట్లు తెలిపారు.
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు పాలన సాగిస్తోందని నట్టి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయడం గ్యారంటీ అని ఆయన వివరించారు. టీడీపీ , జనసేన కార్యకర్తులు అందరూ కూడా పోలింగ్ బూత్ వరకు ఓటు తీసుకు వచ్చి వారి గెలుపునకు కృషి చేయాలన్నారు.
ఐటీ శాఖమంత్రి గుడివాడ అమర్నాథ్ ఇప్పటి వరకు రాష్ట్రానికి ఇప్పటి వరకు ఎన్ని పరిశ్రమలు తీసుకుని వచ్చారు అంటూ నట్టి ప్రశ్నించారు. సీఎం సొంత బాబాయిని ఎవరు చంపారో ఇప్పటి వరకు తెలియని మిస్టరీగానే ఉండిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. విశాఖలో 500 కోట్లు పెట్టి బంగ్లాను కడుతున్నారు. దానిని ఎవరి కోసం నిర్మిస్తున్నారని చెప్పాలని నట్టి అన్నారు.
వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా టీడీపీ గెలుపుని ఎవరూ ఆపలేరని అన్నారు. టీడీపీకి ఈసారి కచ్చితంగా 152 సీట్లు, వైసీపీకి 23 సీట్లు వస్తాయని నట్టి ఈ సందర్భంగా ఆయన జోస్యం చెప్పుకొచ్చారు.
Also read: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. డీఎస్పీపై మంత్రి బొత్స కీలక ప్రకటన!