గ్రే కలర్ సూట్లో, స్టయిలిష్ లుక్ లో టాలీవుడ్ టాప్ హీరో.. ఫోటోస్ వైరల్.!! టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లండన్ లో దిగిన ఫొటో వైరల్ గా మారాయి. గ్రే కలర్ సూట్లో, స్టయిలిష్ కళ్లజోడుతో అల్లు అర్జున్ సూపర్ గా ఉన్నారు. అల్లు అర్జున్ పుష్ప-2 షూటింగ్ కు స్మాల్ బ్రేక్ ఇచ్చి తన ఫ్యామిలీతో కలిసి లండన్ లో ఎంజాయ్ చేస్తున్నారు. By Jyoshna Sappogula 28 Sep 2023 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Allu Arjun: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) లండన్ లో దిగిన ఫొటో వైరల్ గా మారాయి. గ్రే కలర్ సూట్లో, స్టయిలిష్ కళ్లజోడుతో అల్లు అర్జున్ సూపర్ గా ఉన్నారు. అల్లు అర్జున్ పుష్ప-2 షూటింగ్ కు స్మాల్ బ్రేక్ ఇచ్చి బన్నీ తన కుటుంబంతో కలిసి లండన్ ట్రిప్‌కు వెళ్లారు. కాగా, అల్లు అర్జున్ వైఫ్ అల్లు స్నేహారెడ్డి రేపు తన పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఆమె పుట్టినరోజును లండన్ లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకే బన్నీ తన కుటుంబంతో కలసి యూకే ట్రిప్ కు వెళ్లినట్టు తెలుస్తోంది. తిరిగి అక్టోబరు మొదటివారంలో హైదరాబాద్ చేరుకుని, పుష్ప-2 షూటింగ్ కు హాజరవుతారని సమాచారం అయితే రిసెంట్ గా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) కు అరుదైన గౌరవం దక్కనుందని జోరుగా ప్రచారం జరిగింది. లండన్ లోని ప్రఖ్యాత ‘మేడం తుస్సాడ్స్’ మ్యూజియంలో మైనపు బొమ్మ రూపంలో అల్లు అర్జున్ అతి త్వరలో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. అక్కడే అల్జు అర్జున్ మైనపు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారని టాక్ వినిపించింది. ఇందుకు సంబంధించిన సన్నాహకాలు మొదలైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ పర్యటనలో భాగంగానే అల్జు అర్జున్ లండన్ మ్యూజియాన్ని సందర్శించడం తోపాటు, మైనపు విగ్రహం రూపొందించడానికి కావాల్సిన తన శరీర కొలతలను ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. దక్షిణాది నుంచి ఇప్పటికే ప్రభాస్, మహేశ్ బాబు మైనపు విగ్రహాలను లండన్ మ్యూజియంలో ఏర్పాటు చేయగా, ఇప్పుడు అల్లు అర్జున్ వారి సరసన చేరిపోనున్నాడని సమాచారం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెరంగేట్రం చేసిన ఈ స్టార్ హీరో.. ‘గంగోత్రి’ సినిమాతో హీరోగా స్క్రీన్‌పై కనిపించారు. ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి తనకెదురైన ప్రతి సవాల్‌ను స్వీకరించి ఓ మంచి నటుడిగా తనని తాను నిరూపించుకున్నాడు. పుష్ప ది రైజ్’ సినిమాలో పుష్ప రాజ్‌గా నటించి నేషనల్ లెవల్ లో ఎదిగాడు. Also Read: ఆ మాట విన్నప్పుడు ఏడుపు వచ్చింది.. హాస్యబ్రహ్మతో స్పెషల్ ఇంటర్వ్యూ లైవ్ #allu-arjun #tollywood మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి