Gaami OTT Release : ఓటీటీలోకి మాస్ కా దాస్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ చిత్రం గామి. మార్చి 8న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ 5 వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.

New Update
Gaami OTT Release : ఓటీటీలోకి  మాస్ కా దాస్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Gaami : మాస్ కా దాస్(Mass Ka Das), యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన లేటెస్ట్ చిత్రం గామి. ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురేపింది. రిలీజైన ఫస్ట్ డే నుంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది ఈ మూవీ. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ తో  సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టింది. ఇక ఈ సినిమాలో అఘోరాగా కనిపించిన విశ్వక్ పాత్రకు  ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అంతే కాదు  విశ్వక్ కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది గామి చిత్రం.

Also Read : Tillu Square: “ఇది యూనివర్సల్ సినిమా”.. ‘టిల్లు స్క్వేర్‌’ పై మెగాస్టార్‌ రియాక్షన్‌ ఏంటో చూడండి

గామి ఓటీటీ స్ట్రీమింగ్

అయితే ఇప్పటివరకు థియేటర్స్ లో సందడి చేసిన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీ(OTT) ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లేట్ ఫార్మ్ జీ5(Zee5) గామి స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు దక్కించుకుంది. ఏప్రిల్ రెండు లేదా మూడవ వారంలో స్ట్రీమింగ్ కు రానున్నట్లు సమాచారం. దీని పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అలాగే గామి సాటిలైట్ హక్కులను జీ తెలుగు ఛానల్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Gaami

ఈ సినిమాతో విద్యాధర్ కాగిత దర్శకుడిగా పరిచయమయ్యారు. చాందిని చౌదరి(Chandini Chowdary) కథానాయికగా నటించగా.. ఎంజీ అభినయ, హారిక పెడాడ, మహ్మద్ సమద్ కీలక పాత్రలు పోషించారు. యువీ క్రియేషన్స్ బ్యానర్ పై కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టిన ఈ మూవీకి నరేష్ కుమారన్ సంగీతం అందించారు.

Gaami

Also Read : Raashii Khanna : ఎల్లో డ్రెస్ లో అది చూపిస్తూ రాశిఖన్నా అందాల ఆరబోత

Advertisment
తాజా కథనాలు