Mirai Movie: సూపర్‌యోధగా తేజ సజ్జ.. 'మిరాయ్' గ్లింప్స్ అదిరిపోయింది..!

యంగ్ హీరో తేజ సజ్జ చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ కు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు 'మిరాయ్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో తేజ సూపర్‌యోధగా కనిపించబోతున్నారు.

New Update
Mirai Movie: సూపర్‌యోధగా తేజ సజ్జ.. 'మిరాయ్' గ్లింప్స్ అదిరిపోయింది..!

Teja Sajja's New Movie Mirai: ఇటీవలే హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన యంగ్ హీరో తేజ సజ్జ ప్రస్తుతం వరుస ఆఫర్స్ తో దూసుకెళ్తున్నారు. తాజాగా ఈ యంగ్ హీరో  చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్టు కు సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

'మిరాయ్'

ఈగల్, సూర్య vs సూర్య ఫేమ్ కార్తీక ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జ ఓ పాన్ ఇండియా మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్,  ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. 'మిరాయ్' అనే టైటిల్ తో సినిమా గ్లింప్స్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రంలో తేజ సజ్జ ఓ సూపర్ యోధగా కనిపించబోతున్నారు.

గ్లింప్స్

థ్రిల్లింగ్ అడ్వెంచర్స్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మౌర్య సామ్రాజ్యపు రాజు అశోకుడు కలియుగం అనంతరం పశ్చాతాపంతో యోగిగా మారతాడు. అయితే అశోకుడిని యోగిగా మార్చిన ఓ అపార గ్రంధం ఆపదలో ఉంటుంది. తొమ్మిది గ్రంథాలతో చేసిన ఆ మహా గ్రంథాన్ని కొంత మంది దుండగులు దక్కించుకోవాలని ప్రయత్నిస్తారు. ఇక ఆ గ్రంథాన్ని కాపాడడానికి వచ్చే యోధుడే హీరో. ఆ మహా గ్రంథాన్ని హీరో ఎలా కాపాడతాడు .? ఆ క్రమంలో ఎదుర్కునే సవాళ్ళే ఈ సినిమా కథగా ఉండబోతున్నట్లు గ్లింప్ల్స్‌ లో అర్థమవుతోంది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

Also Read: Salman Khan House Firing: సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనలో వెలుగులోకి సంచలన విషయాలు..రూ. 4లక్షల సుపారీ..!

Advertisment
తాజా కథనాలు